ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అలా సమాచారం ఇలా నిర్ణయం

ABN, Publish Date - May 09 , 2025 | 01:32 AM

నెల రోజుల్లో భారత జట్టు సుదీర్ఘమైన ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. 2025-27 ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప సైకిల్‌కు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌లు ఆడడం ద్వారా శ్రీకారం చుట్టనుంది...

బీసీసీఐకి రోహిత్‌ షాక్‌

న్యూఢిల్లీ: నెల రోజుల్లో భారత జట్టు సుదీర్ఘమైన ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. 2025-27 ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప సైకిల్‌కు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌లు ఆడడం ద్వారా శ్రీకారం చుట్టనుంది. ఈ సిరీ్‌సకు తానే సారథ్యం వహించాలన్న ఆకాంక్షను రోహిత్‌ శర్మ పలు సందర్భాలలో వ్యక్తంజేశాడు. కానీ బుధవారంనాడు అనూహ్యంగా రోహిత్‌.. టెస్ట్‌ల నుంచి రిటైరవుతున్నట్టు ప్రకటించి అటు బీసీసీఐకి ఇటు తన అభిమానులకి షాకిచ్చాడు. అయితే, రోహిత్‌ అనూహ్య నిర్ణయం వెనక పెద్ద తతంగమే నడిచినట్టు జాతీయ మీడియా కథనం. ఆ కథనాల ప్రకారం.. వచ్చేవారం జాతీయ సెలెక్షన్‌ కమిటీ ఇంగ్లండ్‌ టూర్‌కు జట్టును ఎంపిక చేయనుంది. అయితే, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ కొత్త కెప్టెన్‌ నేతృత్వంలోనే ఇంగ్లండ్‌తో తలపడాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ సమాచారం ఎలాగోలా రోహిత్‌ చెవిన పడింది. అంతే.. అప్పటికప్పుడే టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాలనుకున్న రోహిత్‌ ఈ విషయాన్ని బీసీసీఐకి ఈ-మెయిల్‌ ద్వారా చేరవే శాడు. దీంతో ఇంత అనూహ్యంగా నిర్ణయం ఎందు కు తీసుకున్నాడంటూ బోర్డు పెద్దలు కూడా షాక్‌ తిన్నారు. బోర్డుకు ఈమెయిల్‌ చేసిన కొద్దిసేపటికే సోషల్‌మీడియా ద్వారా తన వీడ్కోలు నిర్ణయాన్ని రోహిత్‌ వెల్లడించాడు. కాగా..అదే సమయంలో ముంబైలోని క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో ఉన్న అజిత్‌ అగర్కార్‌ చాలాసేపు సెల్‌ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు. అతడు అంత సుదీర్ఘ సమయం ఫోన్లో సంభాషించింది రోహిత్‌తోనేనట. ఇక..రోహిత్‌ నిర్ణయాన్ని స్వాగతించిన పలువురు మాజీ క్రికెటర్లు, ఐసీసీ..టె్‌స్టల్లో అతడు అందించిన సేవలను కొనియాడారు.


వ్యక్తిగతంగా విమర్శలా?

భారత వ్యాఖ్యాతలపై హిట్‌మ్యాన్‌ గరం

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ వ్యాఖ్యాతలపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫైర్‌ అయ్యాడు. ఓ ఆటగాడిని లక్ష్యంగా చేసుకొని ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డాడు. ఆటను వదిలి మసాలా వేయడానికి ఎక్కువగా పాకులాడుతున్నారని చురకంటించాడు. మనోళ్ల వ్యాఖ్యానంతో పోలిస్తే ఆస్ట్రేలియా వ్యాఖ్యాతలు బాధ్యతాయుతంగా వ్యవహరి స్తారన్నాడు. ‘కామెంటేటర్ల వ్యాఖ్యలు వింటే బాధేస్తుంది. పేలవ ఫామ్‌ గురించి విమర్శలు చేయడంలో తప్పులేకపోయినా.. దానికీ ఓ హద్దు ఉందనే స్పృహ కామెంటేటర్లలో ఉండాలి. ఏదో మనసులో పెట్టుకొని అదే పనిగా విమర్శలు చేయడం తగదు. కొందరైతే ఆట గురించి విశ్లేషించకుండా, ఆటగాడి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుం టారు. భారత్‌లో వ్యాఖ్యాతలు ఏదో ఒక అజెం డాతోనే వ్యాఖ్యానం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది సరికాదు’ అని హితవు పలికాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులు

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 09 , 2025 | 01:32 AM