Operation Sindoor: జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్ డ్రోన్ దాడులు
ABN , First Publish Date - 2025-05-08T21:28:57+05:30 IST
Operation Sindoor: భారత్ - పాక్ మధ్య యుద్ధం ఈ రాత్రి(గురువారం) మరింత తీవ్రతరమైంది. జమ్ము ఎయిర్ స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్ అటాక్ చేసింది. దీంతో 8 పాక్ మిస్సైల్స్‌ను భారత్ కూల్చేవేసింది.
శ్రీనగర్, మే 08: భారత్ - పాక్ మధ్య యుద్ధం ఈ రాత్రి(గురువారం) మరింత తీవ్రతరమైంది. జమ్ము టార్గెట్ గా యాంటీ మిస్సైల్ సిస్టమ్‌కి దొరక్కుండా పాకిస్థాన్ డ్రోన్లు ప్రయోగించింది. అయితే, భారత్.. యాంటీ డ్రోన్ సిస్టమ్‌తో పాక్ డ్రోన్లు కూల్చివేసింది. అటు, పంజాబ్ అమృత్‌సర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరో వైపు పాకిస్థాన్ మీద దాడి చేసేందుకు జమ్ము ఎయిర్‌పోర్ట్ నుంచి ఫైటర్ జెట్స్ బయల్దేరాయి. పాకిస్థాన్ పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌ను టార్గెట్ చేసింది. అటు, జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు భారత్ గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. పాక్ F-16 ఫైటర్ జెట్‌ని భారత బలగాలు కూల్చేశాయి. మరో రెండు JF-17 యుద్ధ విమానాలను సైతం భారత సైన్యం కూల్చివేసింది. జమ్ము వర్సిటీ దగ్గర రెండు పాక్ డ్రోన్లను భారత బలగాలు కూల్చివేశాయి. పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టామని భారత ఆర్మీ ప్రకటించింది. అటు, రాజస్థాన్ జైసల్మేర్‌లో పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. సాంబా సెక్టార్‌లో పాక్ దాడులకు తెగబడ్డంతో పాకిస్థాన్ దాడులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి.
జమ్ము ఎయిర్ స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్ అటాక్ చేసింది. దీంతో 8 పాక్ మిస్సైల్స్‌ను భారత్ కూల్చేవేసింది. జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్ డ్రోన్ దాడులు చేసింది. జమ్ము ఎయిర్‌స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్ అటాక్ చేయగా, 8 పాక్ మిస్సైల్స్‌ను భారత్ చాకచక్యంగా కూల్చేసింది. S400 సిస్టమ్‌తో పాక్ మిస్సైల్స్ ను భారత్ ధ్వంసం చేసింది. మరోవైపు, భారత సేనలు జమ్ము, కశ్మీర్, రాజస్థాన్‌ను బ్లాకౌట్ చేసి,
ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. పలుచోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చి వేయగా, పోరు హోరా హోరీగా సాగుతోంది. జమ్ములో ఏడు చోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్ము, కశ్మీర్, అఖ్నూర్, పూంచ్‌లో సైరన్‌లు మారుమ్రోగాయి. పఠాన్‌కోట్ ఎయిర్‌పోర్టును పాక్ టార్గెట్ చేసింది. అటు, కుప్వారాలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ తన అక్కసు వెళ్లగక్కేందుకు ఎంత చేయాలో అంతా చేస్తోంది. ఆ క్రమంలో జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్ డ్రోన్ దాడులకు దిగుతోంది. జమ్ములోని ఎయిర్‌స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్ దాడి చేసింది. అందుకు సంబంధించిన 8 పాక్ మిస్సైల్స్‌ను భారత్ కూల్చేసింది. దాదాపు ఎస్ 400 సిస్టమ్స్‌తో వాటిని భారత్ సైన్యం కూల్చివేసింది.
జమ్ము, కశ్మీర్, రాజస్థాన్‌ను బలగాలు బ్లాకౌట్ చేశాయి. దీంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చి వేసింది. మరోవైపు జమ్ములో ఏడు చోట్ల పేలుళ్ల శబ్దాలు మార్మోగాయి. జమ్ము, కశ్మీర్, అఖ్నూర్, పూంచ్‌లలో సైరన్‌లు మోగాయి. ఇక పఠాన్‌కోట్ ఎయిర్‌పోర్టును పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగా చేసుకొంది. మరోవైపు కుప్వారాలో భారత్, పాకిస్థాన్ సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.