Ravi Shastri Hails: నా శిష్యుల్లో కోహ్లీ బెస్ట్
ABN, Publish Date - Aug 15 , 2025 | 06:17 AM
తాను శిక్షణ ఇచ్చిన టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్లేయర్ అని రవిశాస్త్రి ప్రశంసించాడు. 2017-2021 వరకు భారత జట్టు కోచ్‌గా శాస్త్రి వ్యవహరించాడు...
న్యూఢిల్లీ: తాను శిక్షణ ఇచ్చిన టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్లేయర్ అని రవిశాస్త్రి ప్రశంసించాడు. 2017-2021 వరకు భారత జట్టు కోచ్‌గా శాస్త్రి వ్యవహరించాడు. కోహ్లీ అద్భుత ప్రదర్శన కారణంగానే తన హయాంలో భారత్ టెస్టుల్లో టాప్ టీమ్‌గా నిలిచిందని చెప్పాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో కోహ్లీ ప్రదర్శన నమ్మశక్యం కాని రీతిలో ఉందన్నాడు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత జట్టును నడిపించే నాయకత్వ లక్షణాలు కోహ్లీలోనే చూశానని తెలిపాడు. బ్యాటర్‌గా తన బాధ్యతలు నిర్వహిస్తూనే.. జట్టు గెలుపు కోసం తుదికంటా పోరాడేవాడని కితాబిచ్చాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
For More AndhraPradesh News And Telugu News
Updated Date - Aug 15 , 2025 | 06:17 AM