Share News

MLA Expels: సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

ABN , Publish Date - Aug 14 , 2025 | 03:37 PM

మంచి చేస్తే పది ముందు చెప్పమన్నారు. చెడు చేస్తే చెవులో చెప్పమన్నారు. కానీ మంచి చేశారు. అది కూడా ముఖ్యమంత్రి. అదే విషయాన్ని పది మంది ముందు చెప్పారు. అదే తప్పు అయింది ఆ ఎమ్మెల్యే విషయంలో. అందుకే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు.

MLA Expels: సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
MLA Pooja Pal

లక్నో, ఆగస్ట్ 14: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించిన కారణంగా సమాజ వాదీ ఎమ్మెల్యే పూజా పాల్‌‌ను ఆ పార్టీ నుంచి ఆగ్ర నాయకత్వం బహిష్కరించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతోపాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున పూజా పాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాజ వాదీ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గురువారం చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజ వాదీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యల కారణంగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయన్నారు. అలాగే నేరాల సంఖ్యను తగ్గించేందుకు ఆయన చేపట్టిన విధానాలు సత్ ఫలితాలు ఇస్తున్నాయని.. అందులోభాగంగా నేరాలు దాదాపుగా తగ్గిపోయాయంటూ ఆమె ప్రశంసించారు. అందులోభాగంగా సీఎంకు పూజా పాల్ ధన్యవాదాలు సైతం తెలిపారు. సీఎం యోగికి ధన్యవాదాలు చెప్పిన కొన్ని గంటలకే.. పూజా పాల్‌ను సమాజ వాదీ పార్టీ నుంచి బహిష్కరించడం గమనార్హం.


ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047పై 2 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో సమాజ వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాఫియా ఆగడాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారని ప్రశంసించారు. తన భర్త మాజీ ఎమ్మెలే రాజు పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతీక్ అహ్మద్‌ను యోగి ప్రభుత్వం సమాధి చేయడం ద్వారా తనతోపాటు వందలాది మంది మహిళా బాధితులకు న్యాయం చేసిందన్నారు. నేరాల అదుపు కోసం యోగి తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రమంతా.. సీఎం యోగి వైపు చూస్తోందన్నారు.


2005లో సమాజ వాదీ పార్టీ ఎమ్మెల్యే రాజు పాల్‌ పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడింది.. గ్యాంగస్టర్లు అతీక్ అహ్మద్‌తోపాటు అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే రాజు పాల్‌ను పూజా పాల్ వివాహం చేసుకున్న కేవలం 10 రోజులకే ఈ హత్య జరిగింది. ఇక గ్యాంగస్టర్లు అతీక, అష్రాఫ్‌లు 2023లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూజా పాల్‌ అసెంబ్లీలో సీఎం యోగి అదిత్యను ప్రశంసించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మాచైల్ మాతా యాత్ర మార్గంలో ఘోరం.. 12 మంది మృతి

ఏపీలో అమానుషం.. గర్భిణిని దారుణంగా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 04:07 PM