Share News

Pregnant woman Case: ఏపీలో అమానుషం.. గర్భిణిని దారుణంగా..

ABN , Publish Date - Aug 14 , 2025 | 02:00 PM

సబ్బవరం మండలం బంజరి వద్ద గుర్తు తెలియని మహిళను హత్య చేసి కొంతమంది దుండగులు కాల్చిపడేశారు. ఆమె గర్భవతీగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా పరిశీలించారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తనిఖీలు చేపట్టారు.

 Pregnant woman Case: ఏపీలో అమానుషం.. గర్భిణిని దారుణంగా..

అనకాపల్లి జిల్లా: సబ్బవరం మండలం బంజరి వద్ద గుర్తు తెలియని మహిళను హత్య చేసి కొంతమంది దుండగులు కాల్చిపడేశారు. ఆమె గర్భవతీగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా పరిశీలించారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తనిఖీలు చేపట్టారు. హతురాలి వయసు 32 నుంచి 35 సంవత్సరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాళ్లు చేతులు కట్టేసి పీక నులిమి చంపేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులను వివరాల అడిగి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తెలుసుకున్నారు. హత్య కేసును ఛేదించేందుకు పోలీసు బృందాల అన్వేషిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలను ఎదిరించాం: సీఎం చంద్రబాబు

పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచింది: మారెడ్డి లతారెడ్డి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 02:01 PM