Share News

TDP: పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచింది: మారెడ్డి లతారెడ్డి

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:02 PM

పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచిందని మారెడ్డి లతారెడ్డి ఉద్ఘాటించారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్నినిలబెట్టుకుంటామని చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ఒడిస్తామని మారెడ్డి లతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

TDP: పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచింది: మారెడ్డి లతారెడ్డి
Pulivendula ZPTC Bye Election

కడప, ఆగస్టు14 (ఆంధ్రజ్యోతి): పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో (Pulivendula ZPTC Bye Election) తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (Latha Reddy) ఘనవిజయం సాధించారు. 6,050 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ సందర్భంగా లతారెడ్డి మీడియాతో మాట్లాడారు. పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచిందని ఉద్ఘాటించారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్నినిలబెట్టుకుంటామని చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ఒడిస్తామని మారెడ్డి లతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


మా ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే పులివెందుల విజయం: హోం మంత్రి అనిత

AP Home Minister anti-ganja operations

జగన్‌పై ఎంత వ్యతిరేకత ఉందో పులివెందుల తీర్పే చెబుతోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదని పేర్కొన్నారు. పోలీసులను వైసీపీ నేతలు తప్పుబట్టడం సరికాదని చెప్పుకొచ్చారు. గతంలో పులివెందులలో ధైర్యంగా ఓట్లు వేసే పరిస్థితులు లేవని తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేశారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే పులివెందుల విజయమని ఉద్ఘాటించారు హోం మంత్రి అనిత .


జగన్ మోహన్ రెడ్డికి పులివెందుల ఓటమి ఓ చెంప దెబ్బ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు వయసును కూడా గౌరవించకుండా జగన్ నోటి దురుసుతనంగా వ్యవహారించడం వైసీపీ విష సంస్కృతికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని, విలువను పెంచారని ఉద్ఘాటించారు. తనకు పోలీసులు రక్షణ పెంచమని ఓ వైపు కోరుతూనే.. మరోవైపు పోలీసులపై నమ్మకం లేదని ధూషించటం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: మంత్రి సవిత

పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రి సవిత తెలిపారు. అభివృద్ధి కోసమే ప్రజలు ఈ తరహా తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతామని మంత్రి సవిత హెచ్చరించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు జరిగాయని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నమ్మకంతో ప్రజలు విజయం కట్టబెట్టారని ఉద్ఘాటించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీదే విజయమని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది

జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 12:11 PM