CM Chandrababu Naidu: పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలను ఎదిరించాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:27 PM
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
అమరావతి ,ఆగస్టు14 (ఆంధ్రజ్యోతి): పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో (Pulivendula ZPTC by Election) తెలుగుదేశం పార్టీ(TDP) అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి.. పులివెందుల జెడ్పీటిసీ ఉప ఎన్నికలకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పులివెందుల కౌంటింగ్‌లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని ఓటర్లు స్లిప్ పెట్టారని .. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించాలని సూచించారు. టీడీపీ నేతలు పులివెందుల విజయంపై ప్రజలను చైతన్యం చేసే విధంగా మాట్లాడాలని మార్గ నిర్దేశం చేశారు. పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారని నొక్కిచెప్పారు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ఓటు వేశారనేది ఏపీలో ప్రజలకు తెలియచేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని కూడా చెప్పాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది
జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి
For More AndhraPradesh News And Telugu News