Pakistan Super League: ఆ క్రికెటర్లు ఏడ్చారు.. ఇంకెప్పుడూ పాకిస్తాన్‌కు వెళ్లబోమన్నారు: పీఎస్‌ఎల్ ఆటగాడు
ABN, Publish Date - May 10 , 2025 | 09:08 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పోటీగా అదే తరహాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని పలు నగరాలకు చెందిన జట్లు ఈ లీగ్‌లో తలపడాతాయి. ఐపీఎల్ తరహాలోనే విదేశీ ఆటగాళ్లు కూడా పాకిస్తాన్‌లో ఆడుతుంటారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)కు పోటీగా అదే తరహాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను (PSL) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని పలు నగరాలకు చెందిన జట్లు ఈ లీగ్‌లో తలపడాతాయి. ఐపీఎల్ తరహాలోనే విదేశీ ఆటగాళ్లు కూడా పాకిస్తాన్‌లో ఆడుతుంటారు. ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటే పీఎస్‌ఎల్ కూడా జరుగుతోంది. అయితే భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పీఎస్‌ఎల్‌ను రద్దు చేశారు. చాలా మంది క్రికెటర్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.
ఈ ఉద్రిక్తతల కారణంగా పలువురు విదేశీ క్రికెటర్ల తీవ్రంగా భయపడ్డారట. పాకిస్తాన్ నుంచి క్షేమంగా బయటపడితే చాలని ప్రార్థనలు చేశారట. ఈ విషయాన్ని పీఎస్‌ఎల్ ఆటగాడు రషీద్ హుస్సేన్ వెల్లడించాడు. బంగ్లాదేశ్‌కు చేరుకునేందుకు దుబాయ్ విమానశ్రాయానికి చేరుకున్న రషీద్ అక్కడ మీడియాతో మాట్లాడాడు. విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్‌లో ఎలాంటి భయాందోళనలకు గురయ్యారో వివరించాడు. పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు డారెల్ మిచెల్, సామ్ బిల్లింగ్స్, కుషాల్ పెరీరా, డేవిడ్ వైస్, టామ్ కర్రన్ తదితర ఆటగాళ్లు చాలా భయపడ్డారని రషీద్ తెలిపాడు.
జీవితంలో ఇంకెప్పుడూ పాకిస్తాన్ వెళ్లబోయేది లేదని తనతో డారెల్ మిచెల్ అన్నట్టు రషీద్ తెలిపాడు. అలాగే పాకిస్తాన్‌లో ఉండగా టామ్ కర్రన్ విపరీతంగా ఏడ్చాడట. ఇంటికి క్షేమంగా చేరుకుంటానో లేదనని తీవ్రంగా భయపడ్డాడట. అతడిని ఓదార్చడం చాలా కష్టంగా మారిందని రషీద్ చెప్పుకొచ్చాడు. క్రికెటర్లకు చెందిన కుటుంబాలు చాలా టెన్షన్ పడ్డాయని, దేవుడి దయ వల్ల తాము క్షేమంగా బయటపడ్డామని రషీద్ తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 10 , 2025 | 09:08 PM