Drone Attack: రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ ఎటాక్.. పీఎస్‌ఎల్ కొనసాగడం ఇక కష్టమే
ABN, Publish Date - May 08 , 2025 | 05:04 PM
పాకిస్తాన్ సైన్యం సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడడంతో పాటు మిస్సైళ్ల దాడి చేస్తోంది. ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భారత్ సైన్యం యాంటీ మిసైల్ సిస్టమ్‌తో ఆ క్షిపణులను తిప్పికొడుతోంది. కాగా, పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంకు సమీపంలో ఓ డ్రోన్ దాడి జరిగినట్టు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
పహల్గాంలో (Pahalgam Terror Attack) అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడిపై భారత్ ప్రభుత్వం తనదైన శైలిలో స్పందించింది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ (Pakistan)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో ఈ మెరుపు దాడులను నిర్వహించింది. దీంతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులపై భారత్ దాడికి దిగితే.. అందుకు ప్రతీకారంగా పాక్ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లోని అమాయక ప్రజలపై తన ప్రతాపం చూపిస్తోంది.
పాకిస్తాన్ సైన్యం సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడడంతో పాటు మిస్సైళ్ల దాడి చేస్తోంది. ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భారత్ సైన్యం యాంటీ మిసైల్ సిస్టమ్‌తో ఆ క్షిపణులను తిప్పికొడుతోంది. కాగా, పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంకు (Rawalpindi Cricket Stadium) సమీపంలో ఓ డ్రోన్ దాడి (Drone Attack) జరిగినట్టు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
పాకిస్తాన్ జర్నలిస్ట్ ఇతిషామ్ ఉల్ హక్ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఈ స్టేడియంలోనే గురువారం రాత్రి పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా బాబర్ ఆజాం నేతృత్వంలోని పెషావర్ జల్మీ, డేవిడ్ వార్నర్ సారథ్యంలోని కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
ఈ స్టేడియంకు దగ్గర్లోనే బాంబు దాడి జరగడంతో క్రికెటర్లు ఎవరూ రావల్పిండిలో ఉండవద్దని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే వంటి పలు దేశాలకు చెందిన క్రికెటర్లు పీసీఎల్ కోసం పాకిస్తాన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ను రద్దు చేయడం లేదా వేదికలను మార్చడం గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 08 , 2025 | 05:04 PM