ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Novak Djokovic: అభిమానుల నుంచి అలాంటి ప్రేమ నాకెప్పుడూ దక్కలేదు: నొవాక్ జకోవిచ్

ABN, Publish Date - Jun 13 , 2025 | 04:22 PM

నడాల్, ఫెడరర్ స్థాయిలో తనకెప్పుడూ క్రీడాభిమానుల ప్రేమ దక్కలేదని టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ తెలిపారు. అయితే, వారంటే తనకెప్పుడూ గౌరవమేనని అన్నారు.

Novak Djokovic

రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్‌ లాగా తనకు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు దక్కలేదని టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ అన్నారు. తానెప్పుడూ టెన్నిస్ ప్రపంచంలో ఫెడరర్, నడాల్ తరువాతి స్థానంలోనే ఉండిపోయానని అన్నారు. నడాల్, ఫెడరర్, జకోవిచ్‌ను టెన్నిస్ దిగ్గజ త్రయంగా పిలుస్తారు. వయసులో జకోవిచ్ నాడాల్ కన్నా ఏడాది, ఫెడరర్ కన్నా ఐదేళ్లు చిన్న. అయితే, ఆటలో మాత్రం ఇద్దరినీ అనేక సందర్భాల్లో అధిగమించాడు. నడాల్, ఫెడరర్ నెలకొల్పిన పలు రికార్డులను బద్దలుకొట్టాడు. 2011లో తొలిసారిగా టాప్ పొజిషన్‌లోకి వచ్చాడు.

ఆటలో మంచి నైపుణ్యం కనబరిచినా కూడా జనాల అభిమానం మాత్రం పొందలేకపోయిన విషయాన్ని జకోవిచ్ అంగీకరించాడు. తల్లిదండ్రుల ప్రేమను పొందలేని సంతానంగా భావించేవాడినని అన్నారు. తన ప్రవర్తన తీరు మార్చుకుంటే జనాల అభిమానం లభిస్తుందేమో అని కూడా అనిపించేదని అన్నాడు. ‘తల్లిదండ్రులకు అక్కర్లేని పిల్లాడిలా అనిపించేది. నా తీరు కూడా అందుకుతగ్గట్టే ఉండేది. బహుశా నా తీరు మార్చుకుంటే అభిమానుల ప్రేమ దక్కుతుందని భావించి అలాగే చేశా. కానీ ఫెడరర్, నడాల్‌కు దక్కిన ప్రేమాభిమానాలు నాకు దక్కలేదు. ఓ తక్కవ స్థాయి వ్యక్తి క్రీడలోకి వచ్చాడని అనుకున్నారు. కానీ నేను నెం.1 అవుతా అని గట్టిగా చెప్పా. ఇది ఎందుకో ఎవరికీ నచ్చలేదు’ అని జకోవిచ్ అన్నారు.

క్రీడలో తన ప్రత్యర్థులకు అపాయం తలపెట్టాలని తనకు ఎప్పుడూ ఉండదని జకోవిచ్ అన్నాడు. వారిపై ద్వేషం, ఆటలో పైచేయి కోసం ఏదైనా చేయాలని కూడా తాను అనుకోనని అన్నాడు. క్రీడాకారులుగా తాము గెలుపు కోసం పోరాడతామని, ఆ సమయంలో ప్రతిభ కనబరిచిన వారే విజేతగా నిలుస్తారని అన్నారు. తనకు ఫెడరర్, నడాల్ అంటే గౌరవమేనని అన్నాడు. అయితే, నడాల్‌తో మరింత సఖ్యతగా ఉండేవాడినని తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

ఓటమి తట్టుకోలేని కార్ల్‌సన్‌ రియాక్షన్‌‌పై గుకేశ్ స్పందన ఇదీ

ఐపీఎల్ చరిత్రలో నెం.1 కెప్టెన్ ఎవరో చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 04:31 PM