Nihal Sarin Beats: అర్జున్‌కు సరీన్ షాక్
ABN, Publish Date - Aug 11 , 2025 | 05:48 AM
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ నాలుగో రౌండ్‌లో అర్జున్ ఇరిగేసి అనూహ్య పరాజయం చవిచూశాడు. ఆదివారం 70 ఎత్తులపాటు హోరాహోరీగా జరిగిన గేమ్‌లో నిహాల్ సరీన్ తనకంటే ఎంతో మెరుగైన అర్జున్‌కు షాకిచ్చాడు...
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్
చెన్నై : చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ నాలుగో రౌండ్‌లో అర్జున్ ఇరిగేసి అనూహ్య పరాజయం చవిచూశాడు. ఆదివారం 70 ఎత్తులపాటు హోరాహోరీగా జరిగిన గేమ్‌లో నిహాల్ సరీన్ తనకంటే ఎంతో మెరుగైన అర్జున్‌కు షాకిచ్చాడు. అలాగే కార్తికేయన్.. ముళి-వాన్ ఫొరీ్‌స్టపై గెలుపొందాడు. ప్రణవ్-విదిత్ గుజ్‌రాతీ, విన్సెంట్ కీమర్-అనీష్ గిరి, రే రాబ్సన్-లియాంగ్ గేమ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ రౌండ్ అనంతరం జర్మన్ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్ (3.5), జీఎం అర్జున్ (2.5) తొలి రెండు స్థానాలలోనే కొనసాగుతున్నారు. చాలెంజర్స్ విభాగంలో.. ద్రోణవల్లి హారికకు మరో పరాజయం ఎదురైంది. నాలుగో రౌండ్‌లో భారత జీఎం ల్యూక్ మెన్డోన్కా 59 ఎత్తులలో హారికపై గెలుపొందాడు. అభిమన్యు పురనిక్-వైశాలిపై, ఇనియన్-ఆర్యాన్ చోప్రాపై, దీప్తాయన్ ఘోష్- హర,్షవర్ధన్‌పై విజయం సాధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News
Updated Date - Aug 11 , 2025 | 05:48 AM