Neeraj Chopra: పాకిస్థాన్ క్రీడాకారుడికి ఆహ్వానం పంపడంపై విమర్శలు.. స్పందించిన నీరజ్ చోప్రా
ABN, Publish Date - Apr 25 , 2025 | 10:27 AM
భారత్‌లో జరుగుతున్న ఈవెంట్‌కు పాకిస్థాన్ క్రీడాకారుడి ఆహ్వానించడంపై విమర్శలు చెలరేగుతుండటంతో జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా స్పందించాడు. పహల్గామ్ ఘటనకు ముందే ఈ ఆహ్వానం పంపించినట్టు స్పష్టం చేశాడు. అకారణంగా తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థానీ జావెలిన్ థ్రో క్రీడాకారుడు అర్షద్ నదీమ్‌ను బెంగళూరులో జరగనున్న ఓ క్రీడా ఈవెంట్‌కు ఆహ్వానించడంపై విమర్శలు వెల్లువెత్తున నేపథ్యంలో నీరజ్ చోప్రా తాజాగా స్పందించారు. పహల్గామ్ దాడికి ముందే తాము ఈ ఆహ్వానాన్ని పంపించామని స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబసభ్యులపై అకారణంగా ద్వేషం చిమ్మడం సరికాదని హితవు పలికాడు. వచ్చే నెలలో జరగనున్న ఈ ఈవెంట్‌కు అర్షద్ జావేద్‌కు ఆహ్వానం పంపించగా అతడు ఇప్పటికే తిరస్కరించాడు. అయితే, పహల్గామ్ దాడి నేపథ్యంలో తనపై విమర్శలు ఎక్కువవడంతో నీరజ్ చోప్రా స్పందించాడు.
‘‘నేను సాధారణంగా మితభాషిని. అయితే, తప్పు జరుగుతున్నప్పు మాత్రం మౌనంగా ఉంటానని అనుకోవద్దు. నా దేశ భక్తిని ప్రశ్నిస్తే మౌనంగా ఉండలేను. బెంగళూరులో జరగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్‌లో పాల్గొనాలంటూ ఆర్షద్ నదీమ్‌కు ఆహ్వానం పంపడంపై నెట్టింట ఎంతో చర్చ జరుగుతోంది. ద్వేషం చిమ్ముతున్నారు’’
‘‘నా కుటుంబంపై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఒక క్రీడాకారుడిగా మరో క్రీడాకారుడికి నేను పంపించిన ఆహ్వానం ఇది. అంతకుమించి దీనికి మరే ప్రాధాన్యం లేదు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప క్రీడాకారులను భారత్‌కు రప్పించడమే ఎన్‌సీ క్లాసిక్ ఉద్దేశం. భారత్‌లో ప్రపంచస్థాయి క్రీడా ఈవెంట్లు నిర్వహించాలని లక్ష్యం. పహల్గామ్ ఘటనకు రెండు రోజుల ముందు అంటే.. సోమవారం ఈ ఆహ్వానాలు వెళ్లాయి’’
‘‘గత 48 గంటల్లో ఇన్ని పరిణామాలకు చోటు చేసుకున్నాక అర్షద్‌కు ఎన్‌సీ క్లాసిక్‌లో పాలుపంచుకునే ప్రశ్నే ఉదయించదు. నాకు నా దేశం, దేశ ప్రయోజనాలే ముఖ్యం. పహల్గామ్ దాడిలో ఆప్తులను పోగొట్టుకున్న వారందరికీ నా సంతాపం తెలియజేస్తున్నాను. వారికి మనశ్శాంతి దక్కాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జరిగిన దానికి యావత్ దేశప్రజల వలనే ఎంతో మనోవేదన చెందాను, ఆగ్రహంతో ఉన్నాను’’
‘‘బాధితులకు న్యాయం దక్కుతుందని నమ్ముతున్నారు. ఇన్నేళ్లు ఎంతో గర్వంగా దేశం తరపున క్రీడల్లో పాలుపంచుకున్నాను. ఇప్పుడు నా వ్యక్తిత్వాన్ని, దేశభక్తిని ప్రశ్నించడం బాధ కలిగిస్తోంది. అకారణంగా నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న వారికి వివరణ ఇచ్చుకోవాల్సి రావడం వేదన కలిగిస్తోంది. మేము చాలా సాధారణ వ్యక్తులం. కానీ నా గురించి కొన్ని చోట్ల తప్పుడు కథనాల ప్రచురితమయ్యాయి. గతేడాది నా తల్లి తన మనసులోని మాటను వ్యక్త పరిస్తే ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అదే జనాలు ఆమెను ఆ ప్రకటనను దృష్టిలో పెట్టుకుని టార్గెట్ చేస్తున్నారు. అయితే, నేను మాత్రం ప్రపంచవేదికలపై భారత కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేసేందుకు కృషి చేస్తూనే ఉంటాను. జైహింద్’’ అని ఓ ప్రకటన విడుదల చేశాడు.
ఇవి కూడా చదవండి:
మన దేశంలో ఏం జరిగిందో ఐసీసీకి కూడా తెలిసే ఉంటుంది.. పాక్‌తో మ్యాచ్‌లపై బీసీసీఐ స్పందన
మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాజస్తాన్ బోల్తా.. బెంగళూరు విజయం
అర్జున్‌ను యువరాజ్‌కి అప్పగిస్తే.. మరో క్రిస్‌గేల్ అవుతాడు: యువీ తండ్రి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 25 , 2025 | 10:34 AM