ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తదుపరి లక్ష్యం మరింత దూరం

ABN, Publish Date - May 18 , 2025 | 02:36 AM

చాలా కాలంగా ఊరిస్తున్న 90 మీటర్ల మార్క్‌ను అధిగమించడంతో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఇక తాను మరింత దూరం జావెలిన్‌ను విసరడంపై దృష్టి సారిస్తానన్నాడు...

దోహా: చాలా కాలంగా ఊరిస్తున్న 90 మీటర్ల మార్క్‌ను అధిగమించడంతో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఇక తాను మరింత దూరం జావెలిన్‌ను విసరడంపై దృష్టి సారిస్తానన్నాడు. దోహా డైమండ్‌ లీగ్‌లో 90.23 మీటర్ల దూరం ఈటెను విసిరిన నీరజ్‌ తన చిరకాల లక్ష్యాన్ని చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అంత దూరం విసిరినా..జర్మన్‌ అథ్లెట్‌ జులియన్‌ వెబర్‌ (91.06 మీ.) తర్వాత చోప్రా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ‘90 మీ. మార్క్‌ చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కాకపోతే తీపి, చేదు కలబోత. అయినా పర్వాలేదు. నేను, కోచ్‌ జాన్‌ జెలెజ్నీ నా త్రోలోని కొన్ని అంశాలను మెరుగుపరుచుకోవడంపై పని చేస్తున్నాం’ అని నీరజ్‌ శనివారం తెలిపాడు. కాగా..పురుషుల జావెలిన్‌ త్రోలో వరల్డ్‌ రికార్డు (98.48 మీ.) చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జెలెజ్నీ పేరిట ఉండడం గమనార్హం.

ప్రధాని అభినందన

నీరజ్‌ చోప్రాను ప్రధాని మోదీ అభినందించారు. ‘అద్భుత ఫీట్‌ సాధించావు. 90మీ. మార్క్‌ను అధిగమించిన నీరజ్‌కు అభినందనలు. ఆటపట్ల అనురక్తి, నిరంతర పరిశ్రమ, అంకితభావానికి దక్కిన ఫలితం ఇది’ అని ప్రధాని ఎక్స్‌లో కొనియాడారు.

ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్

Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 02:36 AM