ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Athletics News: మురళీ అన్నూలకు స్వర్ణాలు

ABN, Publish Date - Aug 11 , 2025 | 05:59 AM

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ బ్రాంజ్‌ లెవెల్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. ఆదివారం ఒక్క రోజుపాటు జరిగిన ఈ పోటీల్లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌, స్టార్‌ స్ర్పింటర్‌ అనిమేష్‌ కుజుర్‌, వెటరన్‌ జావెలిన్‌ త్రోయర్‌ అన్నూ రాణి ...

భారత అథ్లెట్ల సత్తా

వరల్డ్‌ కాంటినెంటల్‌ టూర్‌

భువనేశ్వర్‌: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ బ్రాంజ్‌ లెవెల్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. ఆదివారం ఒక్క రోజుపాటు జరిగిన ఈ పోటీల్లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌, స్టార్‌ స్ర్పింటర్‌ అనిమేష్‌ కుజుర్‌, వెటరన్‌ జావెలిన్‌ త్రోయర్‌ అన్నూ రాణి అంచనాలను నిలబెట్టుకున్నారు. 17 దేశాల నుంచి 150 మంది అథ్లెట్లు పాల్గొనగా, వీరంతా 19 ఈవెంట్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. భారత్‌ నుంచే మొత్తంగా 90 మంది ఆటగాళ్లు ఉండడం విశేషం. అలాగే ఇది ఇన్విటేషనల్‌ టోర్నీ కావడంతో భారత్‌ నుంచి పాల్గొన్న అథ్లెట్లంతా వ్యక్తిగత విభాగాల్లో తమ రాష్ట్రాలు, పనిచేసే సంస్థల తరఫున బరిలోకి నిలిచారు. లాంగ్‌జం్‌పలో మురళీ శ్రీశంకర్‌కు కాస్త పోటీ ఎదురైనా చివరిదైన ఆరో రౌండ్‌లో అత్యధికంగా 8.13మీ. దూరం దూకి స్వర్ణం సాధించాడు. మొత్తంగా తను రెండుసార్లు ఫౌల్‌ అయ్యాడు. అయితే టోక్యో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సకు అర్హత దూరాన్ని (8.27మీ) మాత్రం మురళీ అందుకోలేకపోయాడు. యూపీకి చెందిన 17 ఏళ్ల షానవాజ్‌ ఖాన్‌ (8.04మీ), కర్ణాటక అథ్లెట్‌ లోకేష్‌ సత్యనాథన్‌ (7.85మీ) రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. అలాగే అందరి దృష్టిని ఆకర్షించిన స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌, ఆసియా గేమ్స్‌ చాంపియన్‌ అన్నూ రాణి 62.01మీ. దూరం బల్లెం విసిరి టాప్‌లో నిలిచింది. ఆరు రౌండ్లలోనూ తను ఫౌల్‌ కాకపోవడం విశేషం. అయితే పురుషుల విభాగంలో మాత్రం సచిన్‌ యాదవ్‌ 79.80మీ. దూరంతో ఐదో స్థానంలో నిలిచి నిరాశపర్చాడు. ఇక మహిళల లాంగ్‌జం్‌పలో షైలీ సింగ్‌ (యూపీ, 6.28మీ) టాప్‌లో నిలిచి స్వర్ణం అందుకుంది. ఆ తర్వాతి స్థానాలను భవానీ యాదవ్‌ (రైల్వేస్‌, 6.13మీ), సంద్ర బాబు (జేఎ్‌సడబ్ల్యూ 6.10మీ) దక్కించుకున్నారు.

కుజుర్‌కు 200మీ. టైటిల్‌

పురుషుల 200మీ. పరుగు పందెంలో అనిమేష్‌ కుజుర్‌ (ఒడిశా) అదరగొట్టాడు. 20.77 సెకన్ల టైమింగ్‌తో తను పోడియం సాధించాడు. అయితే 100మీ. రేసులో మన అథ్లెట్లు నిరాశపర్చారు. నాలుగో స్థానంలో నిలిచిన లాలూ ప్రసాద్‌ భోయ్‌ (10.54సె)దే భారత్‌ తరఫున ఉత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. 800 మీ. పరుగులో మహ్మద్‌ అఫ్జల్‌ (ఎయిర్‌ఫోర్స్‌, 1:46.60సె.) తొలి స్థానం దక్కించుకున్నాడు. ప్రకాష్‌ గడగె (మహారాష్ట్ర, 1:47.14), క్రిషన్‌ కుమార్‌ (హరియాణా, 1:48.00) ఆ తర్వాత నిలిచారు. పురుషుల 4్ఠ400మీ.రిలేలో భారత్‌ ‘ఎ’ టీమ్‌ 3:08.37 టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:59 AM