ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mulder Declares: 400 వద్దనుకున్నాడు

ABN, Publish Date - Jul 08 , 2025 | 03:08 AM

టెస్టు క్రికెట్‌లో వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా (400 నాటౌట్‌) అరుదైన రికార్డును అధిగమించాలనేది ప్రతి క్రికెటర్‌ చిరకాల స్వప్నం.

టెస్టుల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా ముల్డర్‌. 297 బంతుల్లో ముల్డర్‌ మూడొందల మార్క్‌ను అందుకొన్నాడు. 2008లో చెన్నైలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 278 బంతుల్లోనే త్రిశతకం బాదాడు.

  • ముల్డర్‌ @367గ లారా రికార్డుకు 33 పరుగుల దూరంలో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌

బులవాయో: టెస్టు క్రికెట్‌లో వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా (400 నాటౌట్‌) అరుదైన రికార్డును అధిగమించాలనేది ప్రతి క్రికెటర్‌ చిరకాల స్వప్నం. కానీ, ఆ రికార్డుకు కేవలం 33 పరుగుల దూరంలోనే ఉన్నా వద్దనుకున్నాడు. దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్‌ వియాన్‌ ముల్డర్‌ (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లతో 367 నాటౌట్‌) చరిత్ర సృష్టించే అరుదైన అవకాశాన్ని కాదనుకుని నిస్వార్థంగా ఆలోచించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో ఆటకు రెండో రోజు నిన్నటి స్కోరు 465/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 626/5 వద్ద డిక్లేర్‌ చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ ముల్డర్‌ త్రిశతకం పూర్తి చేసుకోవడంతోపాటు జోరు మీదున్నాడు. ఈ క్రమంలో లారా క్వాడ్రపుల్‌ సెంచరీ రికార్డును బద్దలుకొడతాని అందరూ భావించారు. కానీ, 33 పరుగుల దూరంలో ఉండగా దక్షిణాఫ్రికా అనూహ్యంగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అయితే, సౌతాఫ్రికా తరఫున అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్‌గా హషీమ్‌ ఆమ్లా (311)ను ముల్దర్‌ వెనక్కినెట్టాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 170 రన్స్‌కే కుప్పకూలిన జింబాబ్వే ఫాలో ఆన్‌లో పడింది. సీన్‌ విలియమ్స్‌ (83 నాటౌట్‌)కు సహకారం అందలేదు. స్పిన్నర్‌ ప్రినెలన్‌ సుబ్రయన్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 456 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన జింబాబ్వే సోమవారం ఆట ఆఖరికి 51/1 స్కోరు చేసింది.

Updated Date - Jul 08 , 2025 | 03:08 AM