Shubman Gill: గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..
ABN, Publish Date - Aug 03 , 2025 | 04:19 PM
ఇంగ్లండ్‌తో ప్రస్తుతం ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మెరుగైన స్థితిలో ఉంది. ఇంగ్లండ్ ఎదుట 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజే బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ చివరి వరకు బాగానే ఆడింది. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు.
ఇంగ్లండ్‌తో ప్రస్తుతం ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మెరుగైన స్థితిలో ఉంది (Ind vs Eng). ఇంగ్లండ్ ఎదుట 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజే బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ చివరి వరకు బాగానే ఆడింది. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఇక, నాలుగో రోజును ఇంగ్లండ్ వికెట్లేమీ కోల్పకుండానే ముగిస్తుంది అనుకుంటున్న దశలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మంచి ట్రిక్ ప్లే చేశాడు.
నాలుగో రోజు చివరి ఓవర్‌ను సిరాజ్ (Mohammed Siraj) చేత వేయించాడు. సిరాజ్ బౌలింగ్ వేస్తున్న సమయంలో స్వ్కేర్ లెగ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ను గిల్ బౌండరీ లైన్ దగ్గరకు పంపించాడు. ఫీల్డర్‌ను అలా వెనక్కి పంపడం బ్యాటింగ్ చేస్తున్న క్రాలీ (Zak Crawley) చూశాడు. దీంతో సిరాజ్ తర్వాతి బంతికి బౌన్సర్ వేయబోతున్నాడని అనుకున్నాడు. అయితే క్రాలీ ఊహకు అందని విధంగా సిరాజ్ యార్కర్ వేశాడు. బౌన్సర్ వస్తుందనుకుంటే యార్కర్ రావడంతో క్రాలీ షాకయ్యాడు. క్రాలీ తేరుకునే లోపే ఆ బంతి వికెట్లను పడగొట్టింది.
గిల్ ప్లే చేసిన ఆ ట్రిక్‌తో ఇంగ్లండ్ కీలకమైన క్రాలీ వికెట్‌ను కోల్పోయింది. దాంతో నాలుగో రోజు ఆటకు తెరపడింది. ఆ వికెట్ పడకపోయి ఉంటే ఇంగ్లండ్ మెరుగైన స్థితిలో నిలిచి ఐదో రోజు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేది. ఇంగ్లండ్‌కు ఆధిక్యం రాకుండా గిల్ ప్లే చేసిన ఆ ట్రిక్‌ను మాజీలు అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 03 , 2025 | 04:19 PM