Mohammed Shami: గర్ల్‌ఫ్రెండ్స్ పిల్లలను చదివిస్తున్నాడు.. కూతుర్ని చూడడం లేదు.. షమీపై భార్య తీవ్ర ఆరోపణలు..
ABN, Publish Date - Aug 16 , 2025 | 09:17 AM
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడి నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జాహన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. షమీని స్త్రీలోలుడిగా అభివర్ణించారు. ప్రియురాళ్ల పిల్లలను మంచి స్కూళ్లలో చదివస్తూ, కన్నకూతురి చదువును మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడి నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జాహన్ (Hasin Jahan) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. షమీని స్త్రీలోలుడిగా అభివర్ణించారు. ప్రియురాళ్ల పిల్లలను మంచి స్కూళ్లలో చదివిస్తూ, కన్నకూతురి చదువును మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. షమీకి, హసీన్ జాహన్‌కు ఐరా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.
ఐరాకు ఓ ఇంటర్నేషన్ స్కూల్‌లో సీటు వచ్చిందని చెబుతూనే, షమీపై జాహన్ తీవ్ర ఆరోపణలు చేశారు. 'ఐరా తండ్రి ఓ బిలియనీర్. అయినా కూతురి స్కూల్ ఫీజుకు మాత్రం డబ్బులు ఇవ్వడు. ఉంపుడుగత్తెల పిల్లలను మంచి స్కూళ్లలో చదివిస్తున్నాడు. కూతురి చదువుకు మాత్రం డబ్బులు లేవని చెబుతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్స్‌ను విమానాల్లో బిజినెస్ క్లాస్‌ల్లో తీసుకెళ్లడానికి లక్షలు ఖర్చు చేస్తాడు. కూతురుని మాత్రం పట్టించుకోడు. అతడు ఒక స్త్రీలోలుడు' అని హసీన్ జాహన్ విమర్శించారు.
మాజీ మోడల్ అయిన జాహన్ 2014 లో మహ్మద్ షమీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2015లో ఒక కూతురు పుట్టింది. మహ్మద్ షమీపై గృహ హింస ఆరోపణలు చేస్తూ హసీన్ జాహన్ 2018 నుంచి షమీకి దూరంగా ఉంటున్నారు. కాగా, షమీ నెలకు రూ.4 లక్షల భరణం చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశించింది. జాహన్ కోసం నెలకు రూ.1.50 లక్షలు, కుమార్తె కోసం నెలకు రూ.2.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఎటూ తేలకుండానే ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. తర్వాత మళ్లీ
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 16 , 2025 | 09:38 AM