మయాంక్ కెరీర్‌తో ఆట లా
ABN, Publish Date - May 18 , 2025 | 02:39 AM
యువ పేసర్ మయాంక్ యాదవ్ క్రికెట్ ప్రవేశం ఓ సంచలనం. బ్యాటర్ల గుండెల్లో గుబులు పుట్టించే వేగంతో బంతులు వేయడం ఈ ఢిల్లీ పేసర్ సొంతం. కానీ తరచూ గాయాల పాలవుతుండడంతో ఈ కుర్ర క్రికెటర్ కెరీరే ప్రమాదంలో...
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
యువ పేసర్ మయాంక్ యాదవ్ క్రికెట్ ప్రవేశం ఓ సంచలనం. బ్యాటర్ల గుండెల్లో గుబులు పుట్టించే వేగంతో బంతులు వేయడం ఈ ఢిల్లీ పేసర్ సొంతం. కానీ తరచూ గాయాల పాలవుతుండడంతో ఈ కుర్ర క్రికెటర్ కెరీరే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. 2023లో మయాంక్‌ను రూ. 23 లక్షలకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. కానీ గాయంతో ఆ ఏడాది ఐపీఎల్‌లో అతడు ఆడలేకపోయాడు. కోలుకొని 2024 ఐపీఎల్ అరంగ్రేటంలోనే ప్రకంపనలు సృష్టించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై అతడు 156.7 కి.మీ.వేగంతో బంతి వేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్‌లో అద్భుత బౌలింగ్‌తో వరుసగా రెండు పోటీల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. తర్వాత వెన్నుగాయం తిరగబెట్టడంతో లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఆపై బెంగళూరులోని ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఓఈ)లో నెలలపాటు నిపుణుల పర్యవేక్షణలో కోలుకొని తిరిగి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ద్వారా అరంగేట్రం చేశాడు. అయితే ఈ సిరీస్ ముగిసే సరికి మళ్లీ వెన్ను నొప్పి తిరగబెట్టడంతో తిరిగి సీఓఈకి మయాంక్ వెళ్లక తప్పలేదు. చికిత్స తీసుకొని ఈసారి ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఆడాడో లేదో మళ్లీ అదే వెన్నుగాయానికి లోనయ్యాడు.
లఖ్‌నవూ ఒత్తిడి చేసిందా ?
పేసర్లకు గాయాలు సహజమే అయినా.. 22 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఇలా తరచూ గాయపడడం మన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలోని స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుల పనితీరుపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. మయాంక్ మరోసారి గాయపడడం ఈ సందేహాలకు తావిచ్చింది. ఇక..రూ. 11 కోట్లతో రిటెన్షన్ చేసుకున్న మయాంక్‌ను ఈసారి ఐపీఎల్‌లో ఆడించాలని లఖ్‌నవూ బీసీసీఐపై ఒత్తిడి తెచ్చిందా..అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్‌లో బరిలో దిగడానికి ముందు సీఓఈలో మయాంక్ కేవలం 10-12 బౌలింగ్ సెషన్లలోనే పాల్గొన్నట్టు సమాచారం. సుదీర్ఘకాలం బౌలింగ్‌కు దూరంగా ఉన్న పేసర్ సామర్థ్యాన్ని అలా కొన్ని సెషన్లలోనే పరిశీలించి పోటీ క్రికెట్ ఆడేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం సబబు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు..ఈ సీజన్‌కు లఖ్‌నవూ శిబిరంలో చేరేటప్పటికే అతడి వెన్నులో వాపు ఉన్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 02:39 AM