Karnataka Govt: ఆర్‌సీబీ కెఎస్‌సీఏలపై చర్యలకు సిద్ధం
ABN, Publish Date - Jul 25 , 2025 | 01:56 AM
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మైకేల్ కున్హా కమిషన్ ఇచ్చిన నివేదికకు...
తొక్కిసలాట ఘటనపై కర్ణాటక కేబినెట్ నిర్ణయం
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మైకేల్ కున్హా కమిషన్ ఇచ్చిన నివేదికకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కమిషన్ సూచించిన విధంగా ఆర్‌సీబీ అనుబంధ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, ఆ సంఘం అధ్యక్షుడు రఘురాంభట్, మాజీ అధ్యక్షుడు ఎ.శంకర్, మాజీ కోశాధికారి జయరాం, ఉపాధ్యక్షుడు ఈఎస్ రాజేష్ మెనన్, డాక్టర్ వెంకట వర్ధన్‌లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 25 , 2025 | 01:57 AM