Jasprit Bumrah: నాకు కెప్టెన్సీ అక్కర్లేదు.. టెస్ట్ నాయకత్వంపై బీసీసీఐకు తేల్చి చెప్పిన బుమ్రా
ABN, Publish Date - May 12 , 2025 | 07:31 AM
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కాబోతున్న తరుణంలో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కాబోతున్న తరుణంలో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పేరు ప్రముఖంగా వినిపించింది. శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా తెర పైకి వచ్చింది. అయితే బుమ్రా మాత్రం టెస్ట్ కెప్టెన్సీని స్వీకరించేందుకు ఇష్టపడలేదట (TeamIndia Test Captain).
తనకు వర్క్‌లోడ్ పెరిగిపోవడమే కాకుండా, గాయాలు కూడా వేధిస్తుండడంతో కెప్టెన్సీ స్వీకరించలేనని, ఇంగ్లండ్ పర్యటనలో మొత్తం ఐదు టెస్ట్‌లు ఆడేది కూడా అనుమానంగానే ఉందని సెలెక్టర్లకు బుమ్రా తేల్చిచెప్పాడట. దీంతో సెలెక్టర్లు బుమ్రా పేరును పక్కన పెట్టారట. కెప్టెన్సీ రేసు నుంచి బుమ్రా తప్పుకోవడంతో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ మాత్రమే కెప్టెన్సీ రేసులో ముందున్నారు. గిల్‌కు కెప్టెన్సీ, పంత్‌కు వైస్-కెప్టెన్ బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మే 24వ తేదీన క్లారిటీ రాబోతోంది.
మరోవైపు కింగ్ కోహ్లీ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి కోహ్లీ ఇప్పటికే బీసీసీఐకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను బీసీసీఐ ధ్రువీకరించలేదు, ఖండించలేదు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లబోయే భారత జట్టును ఈ నెల 24వ తేదీన బీసీసీఐ ప్రకటించబోతోంది. ఆ రోజుతో మొత్తం విషయంపై క్లారిటీ వస్తుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 12 , 2025 | 07:31 AM