ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధర్మశాల నుంచి అహ్మదాబాద్‌కు

ABN, Publish Date - May 09 , 2025 | 01:26 AM

పంజాబ్‌ కింగ్స్‌-ముంబై ఇండియన్స్‌ మధ్య వచ్చే ఆదివారం జరగాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ వేదిక మారింది. ధర్మశాలలో నిర్వహించాల్సిన ఆ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌ తరలించినట్టు గుజరాత్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి అనిల్‌ పటేల్‌...

పంజాబ్‌, ముంబై మ్యాచ్‌ వేదిక తరలింపు

ప్రత్యేక రైలులో ఆటగాళ్లను ఢిల్లీ చేరుస్తాం: బీసీసీఐ

పంజాబ్‌ కింగ్స్‌-ముంబై ఇండియన్స్‌ మధ్య వచ్చే ఆదివారం జరగాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ వేదిక మారింది. ధర్మశాలలో నిర్వహించాల్సిన ఆ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌ తరలించినట్టు గుజరాత్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి అనిల్‌ పటేల్‌ గురువారం వెల్లడించాడు. పాకిస్థాన్‌పై భారత సైన్యం దాడుల నేపథ్యంలో ధర్మశాల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దాంతో మ్యాచ్‌ను అక్కడనుంచి తరలిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్‌లో ఆ మ్యాచ్‌ ఆదివారం మధ్యాహ్నం జరగనుంది. ఇక..ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేయడంతో పంజాబ్‌, ఢిల్లీ జట్లు అక్కడ నుంచి.. ఢిల్లీకి ఎలా చేరుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది. అయితే, ధర్మశాల నుంచి 85 కిలోమీటర్ల దూరంలోనున్న పఠాన్‌కోట్‌కు శుక్రవారం రోడ్డు మార్గం ద్వారా జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది చేరుకుంటారని బీసీసీఐ వెల్లడించింది. పఠాన్‌కోట్‌ నుంచి వీళ్లందరినీ ప్రత్యేక రైలులో ఢిల్లీకి తరలిస్తామని తెలిపింది. ఆదివారం ఢిల్లీ వేదికగా గుజరాత్‌, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులు

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 09 , 2025 | 01:26 AM