ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL Final 2025 PBKS vs RCB: విజేత ఎవరు.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

ABN, Publish Date - Jun 03 , 2025 | 05:35 PM

గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్-2025 తుది అంకానికి చేరుకుంది. విజేత ఎవరో తేలేందుకు మరో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అహ్మాబాద్‌లో కీలక పోటీ జరగబోతోంది.

IPL Final

గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్-2025 తుది అంకానికి చేరుకుంది. విజేత ఎవరో తేలేందుకు మరో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అహ్మాబాద్‌లో కీలక పోటీ జరగబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి (PBKS vs RCB). ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోలేదు (IPL 2025). ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్త ఛాంపియన్ అవతరించబోతోంది.


క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అనారోగ్యం నుంచి కోలుకుని జాష్ హాజెల్‌వుడ్ తిరిగి రావడం ఆర్సీబీకి కొండంత బలాన్ని అందిస్తోంది. అలాగే భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇక, ఎప్పటిలాగానే విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కీలక ప్లేయర్. ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, జితేష్ శర్మ కీలక బ్యాటర్లు. అలాగే కృనాల్ పాండ్యా, షెపర్డ్ అవసరమైనపుడు రాణిస్తున్నారు.


ఇక, పంజాబ్ టీమ్‌కు ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొండంత బలం. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. కోహ్లీ తరహాలోనే ఒత్తిడిలో అద్భుతంగా రాణించడం అయ్యర్ బలం. ఇక ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య, జాస్ ఇంగ్లీస్, నేహల్ వధేరాతో కూడిన పంజాబ్ బ్యాటింగ్ కూడా బలంగానే కనబడుతోంది. అర్ష్‌దీప్ సింగ్, కైలీ జేమీసన్, ఛాహల్, హర్‌ప్రీత్ బ్రార్ చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. మరి, ఐపీఎల్ ఛాంపియన్ ఎవరో మరికొద్ది గంటల్లో తేలబోతోంది.


తుది జట్లు:

పంజాబ్ కింగ్స్ (అంచనా): ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, కైలీ జేమీసన్, ఛాహల్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

రాయల్ ఛాలెంజర్స్ (అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, జితేష్ శర్మ, లివింగ్‌స్టన్, షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హాజెల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ


ఇవీ చదవండి:

గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!

బీసీసీఐ బాస్‌గా మాజీ జర్నలిస్ట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:35 PM