IPL 2025 SRH vs KKR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
ABN, Publish Date - May 25 , 2025 | 07:11 PM
తాజా సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన న్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు చెరో 13 మ్యాచ్‌లు ఆడి ఐదేసి విజయాలు మాత్రమే సాధించాయి. ఇప్పటికే ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
తాజా సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన న్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ (SRH VS KKR) చివరి మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు చెరో 13 మ్యాచ్‌లు ఆడి ఐదేసి విజయాలు మాత్రమే సాధించాయి. ఇప్పటికే ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఈ సీజన్‌లో తమ చివరి మ్యాచ్ ఆడబోతున్నాయి (IPL 2025).
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా బౌలింగ్‌కు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు పాయింట్ల పట్టికలో కాస్త పైకి చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లను ఓడించి ఫామ్‌లోకి వచ్చింది. మరోవైపు కోల్‌కతా కూడా మంచి టచ్‌లోనే కనిపిస్తోంది. మరి, ఈ రెండు జట్లలో ఏ జట్టు ఈ సీజన్‌ను విజయంతో ముగిస్తారో చూడాలి.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేశ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ
కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, డికాక్, రహ్మనుల్లా గుర్జాబ్, రహానే, రఘువంశీ, అండ్రూ రస్సెల్, రింకూ సింగ్, రమణ్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, శివమ్ శుక్లా
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 25 , 2025 | 07:11 PM