ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 SRH vs KKR: క్లాసెన్ ఊర మాస్ ఇన్నింగ్స్.. కేకేఆర్ ముందు భారీ టార్గెట్

ABN, Publish Date - May 25 , 2025 | 09:18 PM

ఢిల్లీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. పరుగుల వరద పారించారు. ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించారు. కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

Heinrich Klaasen

ఢిల్లీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. పరుగుల వరద పారించారు. ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించారు. కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ (105 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడికి ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76) కూడా జతకలిశాడు. దీంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఈ సీజన్‌లో తమ చివరి మ్యాచ్ ఆడుతున్నాయి (IPL 2025).


టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా బౌలింగ్‌ మొదలుపెట్టింది. కోల్‌కతా బౌలర్లను ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ (32) బెంబేలెత్తించారు. అభిషేక్ అవుటైన తర్వాత వచ్చిన క్లాసెన్ మరింత విధ్వంసం సృష్టించాడు. ప్రతి ఓవర్లో ఫోర్‌లు, సిక్స్‌లు కొడుతూ అలరించాడు. బంతిని బౌండరీ అవతలకు పంపడమే లక్ష్యంగా ఆడాడు. 37 బంతుల్లోనే మెరుపు శతకం సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ.


చివర్లో ఇషాన్ కిషన్ (29) కూడా చెలరేగాడు. దీంతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి కోల్‌‌కతా బౌలర్లందరూ షాక్ తిన్నారు. బౌలర్లందరూ ఓవర్‌కు 11 పరుగులకు పైగానే సమర్పించుకున్నారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీశాడు. వైభవ్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.


ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 09:19 PM