IPL 2025, RR vs LSG: లఖ్‌నవూ థ్రిల్లింగ్ విక్టరీ.. రాజస్తాన్‌కు వరుసగా నాలుగో ఓటమి
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:27 PM
రాజస్తాన్ రాయల్స్ మరోసారి చివరి ఓవర్లో 9 పరుగులు చేయలేకపోయింది. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో తడబడింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ విజయాన్ని నమోదు చేసింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది.
రాజస్తాన్ రాయల్స్ మరోసారి చివరి ఓవర్లో 9 పరుగులు చేయలేకపోయింది. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో తడబడింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ విజయాన్ని నమోదు చేసింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. లఖ్‌నవూ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించి విజయం సాధించింది. చివరి ఓవర్లో బౌలర్ ఆవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్తాన్‌ను కట్టడి చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్‌నవూకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మిచెల్ మార్ష్ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్, రిషభ్ పంత్ కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే ఓపెనర్ మార్‌రక్రమ్ (66), ఆయుష్ బదోనీ (50) హాఫ్ సెంచరీలతో ఆదుకోవడంతో పాటు చివర్లో అబ్దుల్ సమద్ (30) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో హసరంగా రెండు వికెట్లు తీశాడు. ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు అద్భుత ఆరంభం దక్కింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (74)తో పాటు 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (34) చక్కగా రాణించి తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. వైభవ్, నితీష్ రాణా వెంట వెంటనే అవుట్ అయ్యారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ (39) చక్కగా రాణించాడు. అయితే చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన దశలో రాజస్తాన్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి రెండు పరుగుల తేడాతో ఓడిపోయారు. లఖ్‌నవూ బౌలర్ ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 19 , 2025 | 11:27 PM