ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 RCB vs LSG: జితేష్ కెప్టెన్ ఇన్సింగ్స్.. టాప్-2లోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ABN, Publish Date - May 27 , 2025 | 11:42 PM

టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ముఖ్యంగా కెప్టెన్ జితేష్ శర్మ (85 నాటౌట్) కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించాడు. విరాట్ కోహ్లీ (54) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

Jitesh Sharma

టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ముఖ్యంగా కెప్టెన్ జితేష్ శర్మ (85 నాటౌట్) కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించాడు. విరాట్ కోహ్లీ (54) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. గురువారం జరగబోయే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ రోజు లఖ్‌‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి (RCB vs LSG).


టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లఖ్‌నవూ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (67) తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ చేశాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్) తన సత్తా ఏంటో చూపించాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి 54 బంతుల్లోనే సెంచరీ చేశాడు. లఖ్‌నవూ భారీ స్కోరుకు బాటలు వేశాడు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 227 పరుగులు చేసింది.


లఖ్‌నవూ నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (30), విరాట్ కోహ్లీ (54) తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. కోహ్లీ మరోసారి హాఫ్ సెంచరీతో ఛేజింగ్‌కు సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. వీరు అవుటైన తర్వాత వచ్చిన పటిదార్ (14), లివింగ్‌స్టన్ (0) ఆకట్టుకోలేకపోయారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జితేష్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ అగర్వాల్ (41 నాటౌట్)తో కలిసి ఆరో వికెట్‌కు వందకు పైగా పరుగులు జోడించి ఆర్సీబీకి విజయం అందించాడు.


ఇవీ చదవండి:

టికెట్ల వ్యవహారం.. సంచలన నివేదిక!

బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 11:46 PM