IPL 2025 PBKS vs RR: నేహల్, శశాంక్ అద్భుత హాఫ్ సెంచరీలు.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ABN, Publish Date - May 18 , 2025 | 05:16 PM
పంజాబ్ బ్యాటర్లు మరోసారి సత్తా చాటారు. రాజస్తాన్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటారు. జైపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
పంజాబ్ బ్యాటర్లు మరోసారి సత్తా చాటారు. రాజస్తాన్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటారు. జైపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి (PBKS vs RR). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నేహల్ వధేరా (70), శశాంక్ సింగ్ (59 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్ ఉంచింది (IPL 2025).
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రియాంశ్ ఆర్య (9), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (21), మిచెల్ ఓవెన్ (0) వెంటవెంటనే అవుటయ్యారు. ఆ దశలో నేహల్ వధేరా (Nehal Wadhera)తో కలిసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 65 పరుగులకు పైగా జోడించారు. శ్రేయస్ అవుటైన తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ (59 నాటౌట్) కూడా కీలక పరుగులు చేశాడు. చివర్లో ఒమర్జాయ్ (21) వేగంగా పరుగులు చేశాడు.
పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండ్ 2 వికెట్లు తీశాడు. రియాన్ పరాగ్, మద్వాల్, క్వెనా మపాకా ఒక్కో వికెట్ తీశారు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకున్న రాజస్తాన్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 220 పరుగులు చేయాలి. మరి, పంజాబ్ బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 05:16 PM