IPL 2025 PBKS vs LSG: టాస్ గెలిచిన లఖ్‌నవూ.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
ABN, Publish Date - May 04 , 2025 | 07:02 PM
ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టుతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ ఈ రోజు ధర్మశాల వేదికగా పోటీ పడుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
ఐపీఎల్‌లో (IPL 2025) మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టుతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ ఈ రోజు ధర్మశాల వేదికగా పోటీ పడుతోంది (PBKS vs LSG). శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన లఖ్‌నవూ ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ టీమ్ బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. ఈ రెండు జట్లు ఈ రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ కావాలని ప్రయత్నిస్తున్నాయి. ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. ఈ రోజు మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి.
తుది జట్లు:
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, ఆవేష్ ఖాన్
పంజాబ్ కింగ్స్ : ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, జాస్ ఇంగ్లీస్, యన్‌సెన్, సూర్యాంశ్, ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, ఛాహల్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2025 | 07:02 PM