IPL 2025 PBKS vs DC: సమ ఉజ్జీల టాప్ ఫైట్.. ధర్మశాలలో గెలిచేదెవరు
ABN, Publish Date - May 08 , 2025 | 05:38 PM
ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే ఆగ్రస్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిపోతుంది. ఢిల్లీ గెలిస్తే టాప్ ఫోర్‌లోకి అడుగుపెడుతుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఏడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఐపీఎల్ (IPL 2025) లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ టోర్నీలో ముందుకు వెళ్లేందుకు ధర్మశాలలో సమఉజ్జీలు తలపడుతున్నాయి. ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతున్నాయి (DC vs PBKS). ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే ఆగ్రస్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిపోతుంది. ఢిల్లీ గెలిస్తే టాప్ ఫోర్‌లోకి అడుగుపెడుతుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఏడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబైని వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి వెళ్తుంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 33 సార్లు తలపడ్డాయి. వాటిల్లో 17 సార్లు పంజాబ్ కింగ్స్ విజేతగా నిలిచింది. 15 సార్లు ఢిల్లీ గెలుపొందింది. ఒక్క మ్యాచ్ టై అయింది. కాగా, ధర్మశాలలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా చెరో రెండు విజయాలతో సమానంగా ఉన్నాయి.
ధర్మశాలలో హెచ్‌పీసీఏ స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుంది. ఇక్కడ కొంత మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి రెండో సారి బ్యాటింగ్ చేయడం సులభమవుతుంది. కాబట్టి, టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమం. ఇక, వాతావరణం పొడిగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశాలు కనిపించడం లేదు. మరి, ఈ సమఉజ్జీల సమరంలో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 08 , 2025 | 05:38 PM