IPL 2025 PBKS vs DC: ధర్మశాలలో పోరు.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
ABN, Publish Date - May 08 , 2025 | 06:18 PM
గత టోర్నీలకు భిన్నంగా మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే ఆగ్రస్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిపోతుంది.
ధర్మశాలలో సమఉజ్జీలు తలపడుతున్నాయి. గత టోర్నీలకు భిన్నంగా మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది (DC vs PBKS). ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే ఆగ్రస్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిపోతుంది. ఢిల్లీ గెలిస్తే టాప్ ఫోర్‌లోకి అడుగుపెడుతుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఏడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది (IPL 2025).
పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కూడా తనదైన రోజున చెలరేగుతున్నాడు. ఇక, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా కీలక ఆటగాడిగా ఉన్నాడు. జాస్ ఇంగ్లిస్, నేహల్ వధేరా కూడా వేగంగా పరుగులు చేస్తూ పంజాబ్ బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక, అర్ష్‌దీప్ సింగ్, ఛాహల్, యన్‌సెన్, ఒమర్జాయ్ తమ బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేయగలుగుతున్నారు. ఇక, గత మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయిన ఢిల్లీ ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నారు.
మెక్‌గర్క్, డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌తో కూడా ఢిల్లీ బ్యాటింగ్ విభాగం బలంగా కనబడుతోంది. అయితే వీరు స్థిరంగా రాణించడంలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, అశుతోష్ శర్మ, నటరాజన్‌తో కూడిన బౌలింగ్ విభాగం ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలుగుతోంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 08 , 2025 | 06:20 PM