IPL 2025 PBKS vs DC: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
ABN, Publish Date - May 08 , 2025 | 08:17 PM
ధర్మశాలలో హెచ్‌పీసీఏ స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుంది. ఇక్కడ కొంత మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి రెండో సారి బ్యాటింగ్ చేయడం సులభమవుతుంది. ఇక, వాతావరణం పొడిగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశాలు కనిపించడం లేదు.
గత టోర్నీలకు భిన్నంగా మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది (DC vs PBKS). ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే ఆగ్రస్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిపోతుంది. ఢిల్లీ గెలిస్తే టాప్ ఫోర్‌లోకి అడుగుపెడుతుంది.
ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఏడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది (IPL 2025).
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ టీమ్ బౌలింగ్‌కు రెడీ అవుతోంది. వర్షం కారణంగా టాస్ వేయడం ఆలస్యంగా మారింది. ధర్మశాలలో హెచ్‌పీసీఏ స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుంది. అయితే వర్షం కురిసిన కారణంగా పిచ్ బౌలింగ్‌కు సహకరించే అవకాశం ఉంది. మ్యాచ్ 8:35కు ప్రారంభం కాబోతోంది. పూర్తి ఓవర్ల ఆట జరగనుంది. మరి, ఈ సమఉజ్జీల సమరంలో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, జాస్ ఇంగ్లీస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, ఒమర్జాయ్, ఛాహల్, యన్‌సెన్, అర్ష్‌దీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్: మెక్‌గర్క్, డుప్లెసిస్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నటరాజన్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 08 , 2025 | 08:17 PM