ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025, PBKS vs CSK: ప్రియాంశ్ ఆర్య సూపర్ సెంచరీ.. చెన్నై టార్గెట్ ఎంతంటే

ABN, Publish Date - Apr 08 , 2025 | 09:08 PM

పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. తనకే సాధ్యమైన షాట్లతో అలరించాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా తను మాత్రం వేగంగా ఆడుతూ అద్భుత అద్భుతమైన శతకం సాధించాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగో వేగవంతమైన సెంచరీ చేశాడు.

Priyansh Arya

పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (Priyansh Arya) అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. తనకే సాధ్యమైన షాట్లతో అలరించాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా తను మాత్రం వేగంగా ఆడుతూ అద్భుత అద్భుతమైన శతకం సాధించాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగో వేగవంతమైన సెంచరీ చేశాడు. అంతకు ముందు 19 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. (PBKS vs CSK). దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.


పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (9), స్టోయినిస్ (4), నేహల్ వధేరా (9), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టాడు. వికెట్లు పడుతున్నా ప్రియాంశ్ (42 బంతుల్లో 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో 103) మాత్రం సింగిల్ హ్యాండ్‌తో పంజాబ్‌కు భారీ స్కోరు అందించాడు. చివర్లో శశాంక్ సింగ్ (52) అర్ధశతకం సాధించాడు. యన్‌సెన్ (34) కీలకమైన పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.


చెన్నై బౌలర్లలో చెన్నై బౌలర్లలో అశ్విన్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీశారు. ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ స్కోరును ఎలా ఛేజ్ చేస్తుందో చూడాలి. రచిన్ రవింద్ర, డెవన్ కాన్వే, గైక్వాడ్, విజయ్ శంకర్ ఈ ఛేజింగ్‌లో కీలకం కానున్నారు. అయితే గత కొన్ని సీజన్లుగా 180 పరుగులు దాటిన స్కోరును ఛేదించడంలో చెన్నై విఫలమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 09:08 PM