IPL 2025 MI vs RR: టాప్ లేపిన ముంబై.. రాజస్తాన్‌పై ఘన విజయం
ABN, Publish Date - May 01 , 2025 | 11:09 PM
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఘనవిజయం సాధించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ఐపీఎల్‌లో (IPL 2025) ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI vs RR) జట్టు ఘనవిజయం సాధించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గత మ్యాచ్‌లో భారీ స్కోరును ఛేజింగ్ చేసిన రాజస్తాన్ బ్యాటర్ల ఆటలు ముంబై బౌలర్ల ముందు సాగలేదు. రాజస్తాన్ బ్యాటర్లలో ఆర్చర్ తప్ప ఒక్కరు కూడా 20 పరుగులు దాటి చేయలేక చతికిల పడ్డారు. గత మ్యాచ్ హీరో వైభవ్ సూర్యవంశీ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు.
టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి రెండు ఓవర్లు కాస్త ఇబ్బంది పడిన ముంబై ఓపెనర్లు రోహిత్, రికెల్టన్ తమ జోరు చూపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి తొలి వికెట్‌కు 116 పరుగులు జోడించారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (48), హార్దిక్ పాండ్యా (48) విలువైన పరుగులు చేశారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తీశారు.
218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. గత మ్యాచ్ హీరో వైభవ్ సూర్యవంశీ పరుగులేమీ చేయకుండానే దీపక్ ఛాహర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. క్రమం తప్పకుండా రాజస్తాన్ వికెట్లు కోల్పవడంతో లక్ష్యానికి చేరువలోకి కూడా రాలేకపోయింది. రాజస్తాన్ బ్యాటర్లలో జోఫ్రా ఆర్చర్ (30) తప్ప ఒక్కరు కూడా 20 పరుగులు దాటి చేయలేకపోయారు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ మూడేసి వికెట్లు తీశారు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, దీపక్ ఛాహల్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో రాజస్తాన్ 16.1ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో ముంబై టీమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్తాన్ ప్లే ఆఫ్స్‌కు దూరమైంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 01 , 2025 | 11:13 PM