ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025, MI vs RCB: టాస్ గెలిచిన ముంబై.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

ABN, Publish Date - Apr 07 , 2025 | 07:01 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో తొలిసారి తలపడబోతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కాబోతోంది.

MI vs RCB

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో తొలిసారి తలపడబోతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కాబోతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. మరోవైపు ఆర్సీబీ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి, ఒకటి ఓడిపోయింది.


తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు సిద్ధమవుతోంది. ముంబై టీమ్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌గా తిరిగి వస్తున్నాడు. బుమ్రా రాకతో ముంబై టీమ్ విజయాల బాట పడుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. మరోవైపు గత మ్యాచ్ ఓటమిని మర్చిపోయి విజయాల బాట పట్టాలని ఊవిళ్లూరుతోంది.


తుది జట్లు:

ముంబై ఇండియన్స్: రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ ఛాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తుర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కళ్, రజత్ పటిదార్, లివింగ్‌స్టన్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజెల్‌వుడ్, యశ్ దయాల్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2025 | 07:21 PM