ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 MI vs PBKS: టాప్ కోసం టఫ్ ఫైట్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

ABN, Publish Date - May 26 , 2025 | 05:02 PM

ఐపీఎల్‌లో మరో ఆసక్తిర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. టాప్-2 బెర్త్ కోసం రెండు బలమైన జట్లు తలపడుతున్నాయి. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

MI vs PBKS

ఐపీఎల్‌లో (IPL 2025) మరో ఆసక్తిర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. టాప్-2 బెర్త్ కోసం రెండు బలమైన జట్లు తలపడుతున్నాయి. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే ఈ సీజన్ ప్లే ఆఫ్స్ కోసం అర్హత సాధించాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు టాప్-2లోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది (MI vs PBKS).


ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో గెలిస్తే 19 పాయింట్లు సాధించి అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఇక, మరోవైపు 16 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఈ రోజు మ్యాచ్‌లో గెలిస్తే 18 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే మ్యాచ్ టాప్-2లో ఓ బెర్త్‌ను కన్ఫామ్ చేస్తుంది.


రోహిత్ శర్మ, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యాతో కూడిన బ్యాటింగ్ విభాగం అత్యంత బలంగా కనబడుతోంది. ఇక, బుమ్రా, బౌల్ట్‌తో కూడిన అరవీర భయంకర బౌలింగ్ విభాగం ముంబై సొంతం. దీపక్ ఛాహర్, కర్ణ్ శర్మ కూడా చక్కగా రాణిస్తున్నారు. మరోవైపు ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరాతో కూడిన పంజాబ్ బ్యాటింగ్ కూడా బలంగానే కనబడుతోంది. అర్ష్‌దీప్ సింగ్, యన్‌సెన్, హర్‌ప్రీత్ బ్రార్ చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఛాహల్ దూరం కావడం మాత్రం పంజాబ్‌కు కాస్త ఆందోళన కలిగిస్తోంది.


తుది జట్లు:

ముంబై ఇండియన్స్ (అంచనా): రోహిత్ శర్మ, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్ ధీర్, దీపక్ ఛాహర్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్

పంజాబ్ కింగ్స్ (అంచనా): ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, యన్‌సెన్, ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:02 PM