IPL 2025 MI vs PBKS: మెరిసిన ముంబై బ్యాటర్లు.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే
ABN, Publish Date - May 26 , 2025 | 09:25 PM
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2 బెర్త్‌ను కన్ఫామ్ చేసుకునేందుకు జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. మరోవైపు భారీ హిట్టర్లను కలిగి ఉన్న ముంబైను పంజాబ్ బౌలర్లు ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేయగలిగారు.
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2 బెర్త్‌ను కన్ఫామ్ చేసుకునేందుకు జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. మరోవైపు భారీ హిట్టర్లను కలిగి ఉన్న ముంబైను పంజాబ్ బౌలర్లు ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేయగలిగారు. సూర్యకుమార్ యాదవ్ (57) మరోసారి అర్ధశతకం సాధించడంతో ముంబై ఫైటింగ్ టోటల్ సాధించగలిగింది (MI vs PBKS). జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్-2 బెర్త్‌ను కన్ఫామ్ చేసుకుంటుంది (IPL 2025).
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. స్లోగా ఉన్న పిచ్‌పై పరుగులు చేసేందుకు ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (24), రికెల్టన్ (21) తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వికెట్లు పడిపోవడంతో ముంబై పరుగుల వేగం తగ్గింది. అయితే మరోసారి సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకం సాధించాడు. ఈ సీజన్‌లో ఐదో హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు.
చివర్లో నమన్ ధీర్ (20) వేగంగా పరుగులు చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో యన్‌సెన్, వైశాఖ్ విజయ్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్‌ప్రీత్ బ్రార్ ఒక్క వికెట్ తీశాడు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మరి, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని పంజాబ్ ఈ స్కోరును ఏలా ఛేజ్ చేస్తుందో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 26 , 2025 | 09:28 PM