IPL 2025 MI vs PBKS: అహ్మదాబాద్‌లో తగ్గిన వర్షం.. మళ్లీ మొదలైతే ఏం చేస్తారు
ABN, Publish Date - Jun 01 , 2025 | 09:46 PM
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ అయిన వెంటనే వర్షం రావడంతో ఒక్క బంతి కూడా పడలేదు. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ మొదలవుతోంది. అయితే ఇది ప్లే ఆఫ్ మ్యాచ్ కావడంతో ఒక్క ఓవర్‌ను కూడా తగ్గించలేదు.
ఐపీఎల్‌లో (IPL 2025) అత్యంత కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఫైనల్ బెర్త్ కోసం రెండు బలమైన జట్లు తలపడుతున్న తరుణంలో వర్షం దోబూచులాడుతోంది. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే 7:30 గంటలకు మొదలు కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతోంది (MI vs PBKS).
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ అయిన వెంటనే వర్షం రావడంతో ఒక్క బంతి కూడా పడలేదు. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ మొదలవుతోంది. అయితే ఇది ప్లే ఆఫ్ మ్యాచ్ కావడంతో ఒక్క ఓవర్‌ను కూడా తగ్గించలేదు. పూర్తి ఓవర్ల ఆట ఆడించాలని ప్రయత్నిస్తున్నారు. మధ్యలో వర్షం అంతరాయం కలిగించకపోతే పూర్తి ఆట సాధ్యమవుతుంది. ఒకవేళ మళ్లీ వర్షం అంతరాయం కలిగిస్తే అప్పుడు ఓవర్లు తగ్గించడం గురించి ఆలోచన చేస్తారు.
ఒకవేళ మళ్లీ వర్షం మొదలై ఈ మ్యాచ్ రద్దైతే పంజాబ్ కింగ్స్‌కు లాభం. ఎందుకంటే పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టే ముందుకు వెళ్తోంది. ముంబై కంటే పంజాబ్ పాయింట్ల పట్టికలో ముందు వరసలో ఉంది. అయితే చివరి వరకు ఫలితం కోసం ప్రయత్నిస్తారు. ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరిపిస్తారు. అది కూడా కుదరకపోతే సూపర్ ఓవర్ ఆడిస్తారు.
ఇవీ చదవండి:
స్పిన్ మాంత్రికుడు వస్తున్నాడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 01 , 2025 | 09:46 PM