ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 MI vs DC: సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే

ABN, Publish Date - May 21 , 2025 | 09:25 PM

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తడబడ్డారు (IPL 2025). వర్షం కారణంగా స్లోగా మారిన పిచ్‌పై పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబైను స్వల్ప స్కోరుకు పరిమితం చేశారు.

Surya kumar Yadav

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగాడు (IPL 2025). వర్షం కారణంగా స్లోగా మారిన పిచ్‌పై పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. మిగతా బ్యాటర్లు ఇబ్బందులు పడ్డ పిచ్‌పై సూర్యకుమార్ యాదవ్ (73) మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. (MI vs DC).


టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆరంభంలో షాక్ తగిలింది. మూడో ఓవర్లోనే రోహిత్ శర్మ (5) అవుటయ్యాడు. ర్యాన్ రికెల్టన్ (25), విల్ జాక్స్ (21) వేగంగా పరుగులు చేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం సమయోచితంగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. తిలక్ వర్మ (27) కూడా కీలక పరుగులు చేశాడు. చివర్లో నమన్ ధీర్ (24) వేగంగా పరుగులు చేశాడు. 19 ఓవర్లో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.


ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. ఛమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. మరి, ముంబై నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఎలా ఛేజింగ్ చేస్తుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోతే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు కనుమరుగైనట్టే. మరి, బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఢిల్లీ బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలి.

ఇవీ చదవండి:

కటౌట్ ఎత్తుకెళ్లిన కమిన్స్

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 09:25 PM