ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025, MI vs CSK: ముంబై హ్యాట్రిక్ విజయం.. చెన్నైకు మరో ఓటమి

ABN, Publish Date - Apr 20 , 2025 | 10:54 PM

గత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కూడా గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించి చెన్నైపై ఘన విజయం సాధించింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Rohit Sharma

గత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కూడా గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించి చెన్నైపై ఘన విజయం సాధించింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఆడుతూ పాడుతూ ఛేదించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోవడంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే ముంబై గెలుపొందింది.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై బ్యాటర్లు చాలా నెమ్మదిగా ఆడారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్ వంటి క్వాలిటీ ముంబై బౌలర్లను ఎదుర్కొని వేగంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. అయితే చెన్నై మిడిలార్డర్ బ్యాటర్లు రవీంద్ర జడేజా (53), శివమ్ దూబే (50) అర్ధశతకాలతో పాటు ఆయుష్ మాత్రే (32) కూడా రాణించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. శాంట్నర్, ఛాహర్, అశ్వనీ కుమార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.


177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు మంచి ఆరంభం దక్కింది. తొలి వికెట్‌కు రోహిత్ శర్మ (76), రికెల్టన్ (24) తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. రికెల్టన్‌ను జడేజా అవుట్ చేయడంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (68) అద్భుతమైన షాట్లతో అలరించాడు. వీరిద్దరూ చెన్నై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మరో 26 బంతులు మిగిలి ఉండగానే ముంబైకి విజయాన్ని అందించారు. ముంబైకి ఇది వరుసగా మూడో విజయం కాగా, చెన్నైకు ఈ సీజన్‌లో ఆరో ఓటమి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2025 | 10:54 PM