IPL 2025, LSG vs GT: వారెవ్వా.. మిచెల్ మార్ష్.. కేఎల్ రాహుల్ రికార్డు సమం
ABN, Publish Date - May 22 , 2025 | 09:13 PM
ఆస్ట్రేలియా టీ-20 కెప్టెన్ మిచెల్ మార్ష్ తాజా ఐపీఎల్ సీజన్‌లో తన జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న మిచెల్ మార్ష్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి
ఆస్ట్రేలియా టీ-20 కెప్టెన్ మిచెల్ మార్ష్ తాజా ఐపీఎల్ సీజన్‌లో తన జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న మిచెల్ మార్ష్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి ( LSG vs GT). ఈ మ్యాచ్‌లో మార్ష్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి లఖ్‌నవూకు భారీ స్కోరు అందించాడు.
లఖ్‌నవూ ఓపెనర్ అయిన మార్ష్ తాజా మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. ఇది మార్ష్‌కు ఈ సీజన్‌లో ఆరో హాఫ్ సెంచరీ. ఈ నేపథ్యంలో లఖ్‌నవూ మాజీ ఆటగాడు కేఎల్ రాహుల్ రికార్డును బద్దలుగొట్టాడు. 2022 సీజన్‌లో లఖ్‌నవూ తరఫున ఆడిన రాహుల్ ఆరుసార్లు 50కి పైగా స్కోరు సాధించాడు. ఆ సీజన్‌లో లఖ్‌నవూ తరఫున 15 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 4 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు కొట్టాడు. తాజా సీజన్‌లో మిచెల్ మార్ష్ కూడా ఆరుసార్లు అర్ధశతకాలు సాధించాడు.
తాజా సీజన్‌లోనే లఖ్‌నవూకు చెందిన మరో ఓపెనర్ ఐదెన్ మార్‌క్రమ్ ఇప్పటివరకు ఐదు అర్ధశతకాలు సాధించాడు. కాగా గతేడాది జరిగిన మెగా వేలంలో మార్ష్‌ను లఖ్‌నవూ యాజమాన్యం 3.40 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆ ధరకు మించి మిచెల్ మార్ష్ న్యాయం చేశాడు. అయితే లఖ్‌నవూ టీమ్ వరుస పరాజయాలతో టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించింది.
ఇవీ చదవండి:
బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 22 , 2025 | 09:13 PM