ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025, LSG vs GT: గుజరాత్ vs లఖ్‌నవూ.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

ABN, Publish Date - May 22 , 2025 | 05:53 PM

వరుస విజయాలతో జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్ మరో కీలక మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టాప్-2 పోరు కోసం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి

LSG vs GT

వరుస విజయాలతో జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్ మరో కీలక మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టాప్-2 పోరు కోసం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి ( LSG vs GT). పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లఖ్‌నవూ టీమ్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే (IPL 2025).


గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 617 పాయింట్లు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇక, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 12 మ్యాచ్‌ల్లో 601 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే జాస్ బట్లర్ 500 పరుగులు సాధించాడు. ఇక, గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 21 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ దక్కించుకున్నాడు. ఇలా అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ గుజరాత్ బౌలర్లు టాప్ స్పాట్‌లలో కొనసాగుతున్నారు.


మరోవైపు లఖ్‌నవూ జట్టు టాపార్డర్ బ్యాటర్లు అయిన మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, మార్‌క్రమ్ పైనే అధారపడుతోంది. టాపార్డర్ విఫలమైతే మాత్రం లఖ్‌నవూకు కష్టాలు తప్పడం లేదు. కెప్టెన్ రిషభ్ పంత్ వైఫ్యలాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు లఖ్‌నవూ బౌలింగ్ విభాగం మరింత బలహీనంగా ఉంది. గత మ్యాచ్‌లో వివాదం కారణంగా స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ దూరం కావడం ఆ జట్టుకు మరింత సమస్యలు తెచ్చిపెట్టింది.


తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్ (అంచనా): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్, రూథర్‌ఫోర్డ్, షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, కగిసో రబాడా

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (అంచనా): మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, రవి బిష్ణోయ్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, ఆవేష్ ఖాన్, రోర్క్

ఇవీ చదవండి:

14 ఏళ్లకే ఇంత క్రేజా!

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 22 , 2025 | 05:53 PM