ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025, LSG vs GT: మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీ.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

ABN, Publish Date - May 22 , 2025 | 09:33 PM

ఓపెనర్ మిచెల్ మార్ష్ (117) అద్భుత సెంచరీతో చెలరేగడంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ భారీ స్కోరు సాధించింది. మార్ష్‌కు తోడు నికోలస్ పూరన్ (56 నాటౌట్) కూడా తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో గుజరాత్ ముందు లఖ్‌నవూ కొండంత టార్గెట్ ఉంచింది.

Mitchell Marsh

ఓపెనర్ మిచెల్ మార్ష్ (117) అద్భుత సెంచరీతో చెలరేగడంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ భారీ స్కోరు సాధించింది. మార్ష్‌కు తోడు నికోలస్ పూరన్ (56 నాటౌట్) కూడా తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో గుజరాత్ ముందు లఖ్‌నవూ కొండంత టార్గెట్ ఉంచింది. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి (LSG vs GT).


టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లఖ్‌నవూ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై లఖ్‌నవూ ఓపెనర్లు చెలరేగారు. మార్‌క్రమ్ (36) తో కలిసి తొలి వికెట్‌కు మార్ష్ 91 పరుగులు జోడించాడు. భారీ సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించాడు. 64 బంతుల్లో 8 సిక్స్‌లు, 10 ఫోర్లతో 117 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో తొలి సెంచరీ చేశాడు. మార్‌క్రమ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ మరో అర్ధశతకం సాధించాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో పంత్ (16) కీలక పరుగులు చేశాడు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగులు చేసింది.


లఖ్‌నవూ బ్యాటర్ల ధాటికి గుజరాత్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మహ్మద్ సిరాజ్ తప్ప మిగిలిన బౌలర్లందరూ ఓవర్‌కు పదికి పైగానే పరుగులు సమర్పించుకున్నారు. సాయి కిశోర్, అర్షద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. మరి, గుజరాత్ ఈ టోర్నీ లీగ్ దశలో టాప్-2లో కొనసాగాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు కీలకం. ఈ నేపథ్యంలో ఈ భారీ టార్గెట్‌ను గుజరాత్ బ్యాటర్లు ఎలా ఛేదిస్తారో చూడాలి.


ఇవీ చదవండి:

14 ఏళ్లకే ఇంత క్రేజా!

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 22 , 2025 | 09:38 PM