IPL 2025 KKR vs RCB: ఐపీఎల్ షురూ.. తొలి మ్యాచ్ విజేత ఎవరు.. వర్షం కరుణిస్తుందా
ABN, Publish Date - May 17 , 2025 | 04:58 PM
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఈ రోజు (మే 17) ప్రారంభం కాబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి.
క్రికెట్ అభిమానులకు మజా అందించేందుకు ఐపీఎల్ (IPL 2025) రెడీ అయింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఈ రోజు (మే 17) ప్రారంభం కాబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని ఆర్సీబీ ఊవిళ్లూరుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కేకేఆర్ కృతనిశ్చయంతో ఉంది (KKR vs RCB).
ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్న అభిమానులకు కాస్త బ్యాడ్ న్యూస్. మ్యాచ్ జన్న బెంగళూరులో ఈ రోజు సాయంత్రం వర్షం కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే కేకేఆర్ ఈ టోర్నీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఆర్సీబీ మళ్లీ టేబుల్ టాప్ స్పాట్‌కు చేరుకుంటుంది. అయితే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకోవాలంటే మాత్రం మరో విజయం సాధించాల్సిందే (KKR vs RCB Match Prediction).
ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటివరకు 36 సార్లు తలపడ్డాయి. వాటిల్లో కేకేఆర్ అధికంగా 21 సార్లు గెలుపొందింది. ఆర్సీబీ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక, తాజా సీజన్‌లో కేకేఆర్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 13 సార్లు పోటీపడగా కేకేఆర్ ఏకంగా 9 సార్లు గెలిచింది. ఆర్సీబీ కేవలం 4 సార్లు మాత్రమే తలపడింది. మరి, ఈ రోజు మ్యాచ్ జరిగితే విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 17 , 2025 | 04:58 PM