IPL 2025 KKR vs PBKS: రాణించిన పంజాబ్ ఓపెనర్లు.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్
ABN, Publish Date - Apr 26 , 2025 | 09:14 PM
ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (83) తో పాటు ప్రియాంశ్ ఆర్య (69) అద్భుతంగా రాణించడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముందు భారీ లక్ష్యం ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (83) తో పాటు ప్రియాంశ్ ఆర్య (69) అద్భుతంగా రాణించడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముందు భారీ లక్ష్యం ఉంచింది. పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో కోల్‌కతా బ్యాటర్లు ఓ పెద్ద పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది.
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బౌలింగ్ చేసిన కేకేఆర్ బౌలర్లకు పంజాబ్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 120 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీరి భారీ భాగస్వామ్యాన్ని ఆండ్రూ రస్సెల్ విడదీశాడు. ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేశాడు. ఇక, సెంచరీకు చేరువ అవుతన్న ప్రభ్‌సిమ్రన్‌ను వైభవ్ అరోరా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే మ్యాక్స్‌వెల్ (7)ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (25) కీలక పరుగులు చేశాడు.
చివర్లో కోల్‌కతా బౌలర్లు పుంజుకుని పంజాబ్‌ను కట్టడి చేశారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్ ఒక్కో వికెట్ తీశారు. మరి, ఈ ఛేజింగ్‌లో కోల్‌కతా బ్యాటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 26 , 2025 | 09:14 PM