IPL 2025 KKR vs PBKS: కోల్‌కతా రివేంజ్ తీర్చుకుంటుందా.. పంజాబ్ మళ్లీ సత్తా చాటుతుందా
ABN, Publish Date - Apr 26 , 2025 | 05:32 PM
ఐపీఎల్ చరిత్రలో గుర్తుంచుకోదగిన మ్యాచ్ ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 111 పరుగులు మాత్రమే చేసింది. సునాయాసంగా గెలవాల్సిన కేకేఆర్ అనూహ్యంగా కుప్పకూలి 95 పరుగులకే ఆలౌటైంది.
ఐపీఎల్ (IPL 2025) చరిత్రలో గుర్తుంచుకోదగిన మ్యాచ్ ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది (PBKS vs KKR). తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 111 పరుగులు మాత్రమే చేసింది. సునాయాసంగా గెలవాల్సిన కేకేఆర్ అనూహ్యంగా కుప్పకూలి 95 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఇంత తక్కువ స్కోరును ఛేదించలేక ఓడిపోయిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఆ దారుణ పరాజయానికి రివేంజ్ తీర్చుకోవాలని అజింక్య రహానే టీమ్ కృత నిశ్చయంతో ఉంది. ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరగబోతోంది.
ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. అందులో 21 మ్యాచ్‌ల్లో కేకేఆర్ విజేతగా నిలిచింది. 13 సార్లు పంజాబ్ విజయకేతనం ఎగురవేసింది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో మాత్రం పంజాబ్ మూడు సార్లు గెలుపొందింది. ఇక, ఈడెన్ గార్డెన్స్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌ల్లో కేకేఆర్ 9 సార్లు, పంజాబ్ 4 సార్లు గెలుపొందాయి. అలాగే ఈడెన్ గార్డెన్స్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు సృష్టించింది.
2024 ఏప్రిల్ 26న జరిగిన ఆ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 261 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఆ భారీ స్కోరును ఛేజ్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఛేజింగ్. అప్పుడు కోల్‌కతాకు నాయకుడు అయిన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు సారథి. ఈ రెండు జట్లు తలపడిన గత రెండు మ్యాచ్‌లు రికార్డులు సృష్టించాయి. మరి, ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతోందో చూడాలంటే మరికొద్ది సేపు ఆగాల్సిందే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 26 , 2025 | 05:32 PM