IPL 2025, KKR vs GT: టాస్ గెలిచిన కోల్‌కతా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
ABN, Publish Date - Apr 21 , 2025 | 07:04 PM
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 112 పరుగులను ఛేదించలేక బోల్తా పడి ఐపీఎల్ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ రోజు (ఏప్రిల్ 21) టాప్ జట్టు అయిన గుజరాత్ టైటాన్స్‌తో తలపడబోతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది
వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఈ రోజు (ఏప్రిల్ 21) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తలపడబోతోంది (KKR vs GT). శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో జోరుమీదుంది. మరోవైపు కోల్‌కతా ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు ఈడెన్ గార్డెన్స్‌లో తలపడబోతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది (IPL 2025).
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. గుజరాత్ టైటాన్స్ ఏ ఒక్కరి మీదనో ఆధారపడకుండా సమష్టిగా రాణిస్తూ దూసుకుపోతోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు ముందుకు వచ్చి జట్టుకు విజయాన్ని అందిస్తున్నాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ స్థిరంగా పరుగులు చేస్తున్నాడు. గత మ్యాచ్‌లో జాస్ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే శుభ్‌మన్ గిల్, రూథర్‌ఫర్డ్ కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఇక, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిశోర్, రషీద్ ఖాన్ చక్కగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లను నిలువరిస్తున్నారు.
ఇక, కోల్‌కతా పూర్తిగా టాపార్డర్‌పైనే ఆధారపడుతోంది. మిడిలార్డర్‌లోని వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్ కూడా ఫామ్‌లోకి రావాల్సి ఉంది. ఇక, బ్యాటింగ్‌తో పోల్చుకుంటే బౌలింగ్‌లో కోల్‌కతా పటిష్టంగా కనబడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలవకుంటే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారతాయి.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ (అంచనా): డికాక్, సునీల్ నరైన్, అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, నోర్ట్జే, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి
గుజరాత్ టైటాన్స్ (అంచనా): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్, రూథర్‌ఫర్డ్, షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 21 , 2025 | 07:05 PM