IPL 2025, KKR vs GT: గుజరాత్‌ను ఆపేదెవరు.. కోల్‌కతాపై ఘన విజయం
ABN, Publish Date - Apr 21 , 2025 | 11:25 PM
వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (90)తో పాటు సూపర్ ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ (52) కూడా హాఫ్ సెంచరీ సాధించడంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. అనంతరం బౌలర్లు చెలరేగి కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేశారు.
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించారు. రస్సెల్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జాస్ బట్లర్ (41) కూడా కీలక రన్స్ చేశాడు. కోల్‌కతా ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లకు కలిసి వచ్చింది. సెంచరీకి చేరువలోకి వచ్చిన తర్వాత గిల్ అవుటయ్యాడు. గిల్ అవుట్ అయిన తర్వాత పరుగుల వేగం నెమ్మదించింది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. కోల్‌కతా ముందు 199 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే గుర్భాజ్ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికి మరో ఓపెనర్ నరైన్ (17) కూడా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రహానే (50) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. కోల్‌కతా ఓటమి ఖారారైంది. చివరకు 20 ఓవర్లలో కోల్‌కతా 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 21 , 2025 | 11:25 PM