IPL 2025, KKR vs CSK: చెన్నైకు స్పిన్ ఉచ్చు.. కోల్‌కతా ముందు స్వల్ప టార్గెట్
ABN, Publish Date - Apr 11 , 2025 | 09:24 PM
తాజా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తీరు మారలేదు. మరో పరాజయం దిశగా సాగుతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తలపడుతోంది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై టీమ్ బ్యాటింగ్‌కు దిగింది.
తాజా ఐపీఎల్ (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తీరు మారలేదు. మరో పరాజయం దిశగా సాగుతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ (KKR vs CSK) తలపడుతోంది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. కోల్‌కతా స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్న చెన్నై కష్టాల్లో పడి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కోల్‌కతా ముందు స్వల్ప టార్గెట్‌నే ఉంచగలిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు మూడో ఓవర్లో మొయిన్ అలీ షాకిచ్చాడు. డాన్ కాన్వే (12)ను పెవిలియన్ చేర్చాడు. అప్పట్నుంచి క్రమం తప్పకుండా చెన్నై వికెట్లను కోల్పోతూనే ఉంది. శివమ్ దూబే (31), రాహుల్ త్రిపాఠి (16), విజయ్ శంకర్ (29) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. రచిన్, అశ్విన్, జడేజా, హుడా, ధోనీ, నూర్ అహ్మద్, కాంబోజ్ మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కోల్‌కతా క్వాలిటీ స్పిన్నర్లు ఎదుర్కోలేక చతికిల పడ్డారు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చెన్నై బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు పడగొట్టారు. మొయిన్ అలీ, వైభవ్ అరోరా ఒక్కో వికెట్ తీశారు. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఆరు వికెట్లు స్పిన్నర్లకు దక్కడం ఇదే తొలిసారి. చెన్నై నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా సునాయాసంగా చేరుకుంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దీంతో చెన్నై వరుసగా ఐదో పరాజయానికి చేరువ అవుతున్నట్టు కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 11 , 2025 | 09:24 PM