ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025: జీటీ బంపర్ విక్టరీ.. ఒక్క దెబ్బకు పాయింట్స్ టేబుల్ షేక్

ABN, Publish Date - Apr 19 , 2025 | 08:07 PM

పెద్దగా అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో అదరగొడుతోంది. పెద్ద పేరున్న ఆటగాళ్లు లేకపోయినా అందరూ సమష్టిగా రాణిస్తూ విజయాలు సాధిస్తోంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కూడా ఓడించింది.

GT vs DC

పెద్దగా అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ (GT) ఈ సీజన్‌లో అదరగొడుతోంది. పెద్ద పేరున్న ఆటగాళ్లు లేకపోయినా అందరూ సమష్టిగా రాణిస్తూ విజయాలు సాధిస్తోంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను (DC vs GT) కూడా ఓడించింది. ఢిల్లీ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జాస్ బట్లర్ (97 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.


ఈ విజయంతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో (IPL Points Table) మళ్లీ టాప్ ప్లేస్‌కు వెళ్లిపోయింది. తాజా మ్యాచ్‌లో ఓడిపోయిన ఢిల్లీ టీమ్ రెండో స్థానానికి పడిపోయింది (IPL 2025). నిజానికి గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటివరకు ఏడేసి మ్యాచ్‌లు ఆడి ఐదేసి విజయాలు సాధించాయి. అయితే ఆ రెండు టీమ్‌లతో పోల్చుకుంటే గుజరాత్ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉంది. దీంతో గుజరాత్ టీమ్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది.


గత మ్యాచ్‌లో ఓటమి పాలై డీలా పడిన గుజరాత్ టైటాన్స్ తాజా మ్యాచ్‌లో విజయంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. అంత భారీ స్కోరును కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించడంతో గుజరాత్ రన్‌రేట్ బాగా మెరుగుపడింది. దీంతో మొదటి, రెండో స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ రెండు, మూడు స్థానాలకు పడిపోయాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2025 | 09:05 PM