ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: నిన్ను ముద్దాడడం కోసం 18 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా: విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

ABN, Publish Date - Jun 04 , 2025 | 02:33 PM

ఐపీఎల్‌లో 18 ఏళ్ల పాటు ఒకే జట్టుకు ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ అందించాలనేది కోహ్లీ కోరిక. అది తాజాగా నెరవేరిన క్షణంలో కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

Virat Kohli

కింగ్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. అయితే గత 18 ఏళ్లుగా అతడికి మిగిలిపోయిన మరో కోరిక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ ఐపీఎల్ టైటిల్ సాధించడం. ఎట్టకేలకు మంగళవారం కోహ్లీ కల సాకారమైంది. ఐపీఎల్‌లో 18 ఏళ్ల పాటు ఒకే జట్టుకు ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ అందించాలనేది కోహ్లీ కోరిక. అది తాజాగా నెరవేరిన క్షణంలో కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు (IPL 2025).


‘ఈ సీజన్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. సుదీర్ఘ కలను ఈ జట్టు సాకారం చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్సీబీ అభిమానులు మా వెన్నంటే నిలిచారు. ఈ విజయం వారికి అంకితం. గత రెండున్నర నెలలుగా ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా. ఎన్నో ఏళ్లుగా ఉన్న అసంతృప్తిని, నిరాశను దాటేసిన క్షణం రానే వచ్చింది. ఆర్సీబీ తరఫున మైదానంలోకి దిగి కృషి చేసిన ప్రతి ఒక్క ఆటగాడికి దక్కిన విజయం ఇది. నిన్ను ముద్దాడడం కోసం 18 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా మై డియర్ ఫ్రెండ్. ఆ ఎదురుచూపులు చాలా విలువైనవి అని రుజువు చేశావు.’ అంటూ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు.


మంగళవారం పంజాబ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ సమయంలో కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. విజయం అందిన తర్వాత మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్‌, మేనేజ్‌మెంట్‌తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఆర్సీబీ తరఫున ఆడిన మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిల్లీర్స్‌ కూడా కోహ్లీతో కలిసి సందడి చేశారు.

ఇవీ చదవండి:

గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!

బీసీసీఐ బాస్‌గా మాజీ జర్నలిస్ట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 05:16 PM